logo

తొలి తెలంగాణ పోరాట యోధుడు సదానందరావు మృతి

మోత్కూరుకు చెందిన తొలి తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ రైతుసంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు కల్వల సదానందరావు (86) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోగుండెపోటుతో మృతిచెందారు.

Published : 20 Oct 2022 05:20 IST


సదానందరావు

మోత్కూరు, న్యూస్‌టుడే: మోత్కూరుకు చెందిన తొలి తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ రైతుసంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు కల్వల సదానందరావు (86) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోగుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈయన రాజ్యసభ మాజీ సభ్యుడు కల్వల ప్రభాకర్‌రావు సోదరుడు. 1962లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. 1969లో తెలంగాణ ప్రజాసమితి నాయకునిగా బైరెడ్డిప్రతాప్‌రెడ్డి, కాంబోజు భద్రయ్యతో కలిసి తెలంగాణ కోసం పోరాడి నెల పాటు నల్గొండలో జైలు జీవితం గడిపివచ్చారు. పలురైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు. సదానందరావు భౌతికకాయంపై బుధవారం ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్‌ మందుల సామేల్‌, రైతుసంఘం  నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని