logo

ఓటు నమోదుకు 7,404 దరఖాస్తులు

నూతన ఓటు దరఖాస్తుతో పాటు మరణించిన వారి ఓట్ల తొలగింపు, ఓటరు జాబితాలో మార్పుల కోసం ఈ నెల 26, 27 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు.

Published : 29 Nov 2022 06:13 IST

మిర్యాలగూడలో బీఎల్వోల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎన్నికల నాయబ్‌ తహసీల్దారు ఆవంచ కల్పన

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: నూతన ఓటు దరఖాస్తుతో పాటు మరణించిన వారి ఓట్ల తొలగింపు, ఓటరు జాబితాలో మార్పుల కోసం ఈ నెల 26, 27 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ప్రత్యేక శిబిరాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూతన ఓటు కోసం 7,404 దరఖాస్తులు, Ë ఓట్ల తొలగింపు కోసం 5,846, జాబితాలో సవరణకు 438 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్‌ 3,4 తేదీల్లో సైతం మరోసారి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రత్యేక శిబిరాల్లో వచ్చిన దరఖాస్తులను బీఎల్వోలు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ఎన్నికల సిబ్బందికి అందిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది దరఖాస్తులు పరిశీలించి..అంతర్జాలంలో నిక్షిప్తం చేయనున్నారు. కాగా ఓటర్ల తుది జాబితా 2023, జనవరి ఐదో తేదీన విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని