logo

ఉర్సు ఉత్సవాలకు ముస్తాబు

భువనగిరి పట్టణంలోని పలు దర్గాలు ఉర్సు ఉత్సవాలకు ముస్తాబవుతున్నాయి. పట్టణంలోని పలు దర్గ్గాల్లో డిసెంబËరు ఐదో తేదీ నుంచి 13 వరకు వరుసగా ఉత్సవాలు జరగనున్నాయి.

Published : 29 Nov 2022 06:18 IST

భువనగిరిలోని హజ్రత్‌ సయ్యద్‌ జమాలుల్‌ బహేర్‌ రహ్మతుల్లా ఆలై దర్గా

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: భువనగిరి పట్టణంలోని పలు దర్గాలు ఉర్సు ఉత్సవాలకు ముస్తాబవుతున్నాయి. పట్టణంలోని పలు దర్గ్గాల్లో డిసెంబËరు ఐదో తేదీ నుంచి 13 వరకు వరుసగా ఉత్సవాలు జరగనున్నాయి. దీంతో పట్టణంలోని పలు దర్గాలు ఆధ్యాత్మికశోభను సంతరించుకోనున్నాయి. ఉర్సు సందల్‌(గంధం) ప్రదర్శన పలు మసీదుల నుంచి ప్రారంభమై దర్గా వరకు కొనసాగుతుంది. గంధం మరుసటి రోజు అన్ని దర్గాలలో దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గంధం ప్రదర్శనను మర్ఫా వాయిద్యాలు, ఫకీరుల విన్యాసాలతో కోలాహలంగా నిర్వహిస్తారు. సందల్‌ రోజు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఏటా వైభవంగా కొనసాగే ఉర్సు ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొనే సంస్కృతి పట్టణంలో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి భారీగా ఉర్సు వేడుకలకు భక్తులు హాజరవుతారు. ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు