logo

రైతు సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాలు

రైతు సంఘం రాష్ట్ర మహాసభలు రెండో రోజు విజయవంతంగా నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ ప్రారంభ ఉపన్యాసం చేశారు.

Published : 29 Nov 2022 06:18 IST

ప్రశ్నిస్తూ.. ధ్వజమెత్తుతూ సాగిన సంఘం రాష్ట్ర మహాసభలు


ఆలిండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లను సన్మానిస్తున్న జూలకంటి రంగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, తదితరులు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రైతు సంఘం రాష్ట్ర మహాసభలు రెండో రోజు విజయవంతంగా నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ ప్రారంభ ఉపన్యాసం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌ అధ్యక్షత వహించారు. కేంద్ర, రాష్ట్రాలు రైతులకు చేస్తున్న అన్యాయాలపై నాయకులు ధ్వజమెత్తారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. సాగు, తాగు నీటి కోసం పోరాడాలని సూచించారు. ఎత్తిపోతల పథకాలు ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రుణ మాఫీ వెంటనే చేయలని గళమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే పోరాటం చేస్తామన్నారు. రైతులకు మద్దతు ధర అందించాలన్నారు. సీపీఐకి చెందిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పస్య పద్మ పాల్గొని మాట్లాడారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌ మాట్లాడారు. జాతీయ నాయకులు హన్నన్‌ మొల్ల, డాక్టర్‌ విజ్జుకృష్ణన్‌లను రైతు సంఘం నాయకులు సన్మానించారు. సంతాప తీర్మానాలు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు చదివారు. కౌలు రైతులను గుర్తించాలని తీర్మానం చేశారు. ప్రజానాట్యమండలి కళాకారులు సౌంస్కృతిక  కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి నారీ అయిలయ్య, లక్ష్మీనారాయణ, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు సయ్యద్‌ హాషం, ప్రభావతి, నాగిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని