logo

రైతన్న సిద్ధం.. సాగుకు సన్నద్ధం

సూర్యాపేట జిల్లాలో యాసంగి నాట్లకు రైతన్నలు సిద్ధమయ్యారు. ఒక వైపు వానాకాలం కొనుగోళ్లు జరుగుతుండగానే మరో వైపు నార్లు పోశారు. పొలాలు దున్ని నాట్లకు సిద్ధం చేస్తున్నారు.

Published : 29 Nov 2022 06:25 IST

3 నుంచి నాగార్జునసాగర్‌ నీటి విడుదలకు ఆదేశం


సూర్యాపేట మండలంలోని సపావత్‌తండాలో నారు తీస్తున్న కూలీలు

సూర్యాపేట గ్రామీణం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లాలో యాసంగి నాట్లకు రైతన్నలు సిద్ధమయ్యారు. ఒక వైపు వానాకాలం కొనుగోళ్లు జరుగుతుండగానే మరో వైపు నార్లు పోశారు. పొలాలు దున్ని నాట్లకు సిద్ధం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 4,60,000 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేశారు. ఇందులో వరి 4,52,000 ఎకరాలు, వేరుశనగ, కందులు, పెసళ్లు, మినుములు, బొబ్బెర పంటలు 8 వేల ఎకరాల్లో వేయనున్నారు. మూసీ, ఎస్‌ఆర్‌ఎస్పీ, నాగార్జునసాగర్‌ కాల్వల నీటిని విడుదల వివరాలను బట్టి నాట్లు వేగవంతం చేసే అవకాశం ఉంది.

వారబందీ విధానం..

డిసెంబరు 3 నుంచి నాగార్జునసాగర్‌ నీరు యాసంగి సాగుకు విడుదల కానుంది. ఏడు విడతలుగా నీటిని విడుదల చేయనున్నట్లు నీటి పారుదల శాఖ డిప్యూటీ సీఈ ప్రేమ్‌చందర్‌ తెలిపారు. మొదటి విడత డిసెంబరు 3 నుంచి 24 వరకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొక్క విడతకు ఆరు రోజుల గ్యాప్‌తో విడతకు తొమ్మిది రోజుల చొప్పున నీటిని ఇవ్వాలని నీటిపారుదల శాఖకు ఆదేశాలు అందాయని వివరించారు.

* ఎస్సారెస్పీ నీరు ఎప్పుడు వస్తుందో ఇంకా నీటిపారుదల శాఖ వద్ద స్పష్టత లేదు. మూసీ నీరు మాత్రం రైతుల కోరిక మేరకు నారుమళ్లకు సోమవారం నుంచి కొంచెం కొంచెం వదిలినట్లు సమాచారం. యాసంగిలో ఆరుతడి పంటలకు మూసీ నీరు డిసెంబరు 18 నుంచి విడుదల చేసే ఆనవాయితీ వస్తోంది. ఈ సంవత్సరం కూడా ఆదే ఆనవాయితీ కొనసాగనుందని తెలుస్తోంది.


నార్లు ముమ్మరంగా పోస్తున్నారు
- రామారావునాయక్‌, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, సూర్యాపేట

జిల్లాలో రైతులు 10 శాతం నార్లు పోశారు. నాట్లకు సైతం మరో పది శాతం మంది సిద్ధంగా ఉన్నారు. డిసెంబర్‌ నెలలో నాట్లు ముమ్మరం కానున్నాయి. ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఎరువులను తీసుకువెళ్లాలి.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు