logo

బాధితుడికి స్వయం ఉపాధి కల్పిస్తాం

రోడ్డు ప్రమాదంలో వెన్ను విరిగి మంచానికే పరిమితమై దయనీయంగా జీవనం కొనసాగిస్తున్న బత్తుల సురేందర్‌ని ఆదుకునేందుకు హోప్‌ ఫర్‌ స్పందన సేవా సంస్థ ముందుకు వచ్చింది.

Published : 02 Dec 2022 03:25 IST

మెడికల్‌ కిట్టు అందించి సురేందర్‌ని పరామర్శిస్తున్న హోప్‌ ఫర్‌ స్పందన సంస్థ సమన్వయకర్త రఘు అరికపూడి

తుర్కపల్లి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో వెన్ను విరిగి మంచానికే పరిమితమై దయనీయంగా జీవనం కొనసాగిస్తున్న బత్తుల సురేందర్‌ని ఆదుకునేందుకు హోప్‌ ఫర్‌ స్పందన సేవా సంస్థ ముందుకు వచ్చింది. ‘ఈనాడు’లో గురువారం ప్రచురితమైన ‘విధి వెన్ను విరిచింది’ కథనానికి సంస్థ స్పందించింది. బీడీఎల్‌ విన్నర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, హోప్‌ ఫర్‌ స్పందన సేవా సంస్థ సమన్వకర్త రఘు అరిక పూడి, సభ్యులు గురువారం ఇబ్రహింపురం గ్రామానికి వెళ్లి సురేందర్‌ను పరామర్శించారు. యూరిన్‌ బ్యాగులు, డైపర్లు, కాటన్‌రోల్‌, జెల్‌, బెటాడియన్‌, ఆయింట్‌మెంట్లు అందజేశారు. ప్రతి నెలా రెండు వేలు విలువ చేసే మెడికల్‌ కిట్టు ఏడాది పాటు అందిస్తానని తెలిపారు. స్వయం ఉపాధి కింద కిరాణ దుకాణం నెలకొల్పేందుకు సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని