logo

బోధనతో సత్ఫలితాలు సాధించాలి

విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పెంపొందించే విధంగా బోధన కొనసాగాలని డీఈవో నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని విజ్ఞాన్‌ హైస్కూల్‌లో గురువారం ఏర్పాటు చేసిన తొలిమెట్టు కార్యక్రమం అమలులో భాగంగా మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధనపై రెండు రోజుల శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

Published : 02 Dec 2022 03:25 IST

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఈవో నారాయణరెడ్డి

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పెంపొందించే విధంగా బోధన కొనసాగాలని డీఈవో నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని విజ్ఞాన్‌ హైస్కూల్‌లో గురువారం ఏర్పాటు చేసిన తొలిమెట్టు కార్యక్రమం అమలులో భాగంగా మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధనపై రెండు రోజుల శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా పరిధిలోని 50 పాఠశాలల్లోని సముదాయ ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. విద్యా బోధనలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉపాధ్యాయులు తమ బోధన పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను కనీస స్థాయి నుంచి సామర్థ్యాల సాధనను ప్రారంభించి మంచి ఫలితాలను సాధించాలని అన్నారు. సమష్టి కృషితో తొలి మెట్టును విజయవంతం చేయాలని కోరారు. కోర్సు ఇన్‌ఛార్జి శ్రీనివాసులు, మండల విద్యాధికారులు లక్ష్మినారాయణ, నాగవర్థన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని