logo

తలో చెయ్యేసి.. దారేసి..!

కొలనుపాక- పటేలుగూడెం రహదారిలోని వాగుపై రైతులు తాత్కాలికంగా రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. ఆగస్టులో వర్షాలకు వాగులో నీటి ప్రవాహ ఉద్ధృతికి సిమెంట్‌ పైపులు, మొరం మట్టితో ఉన్న రహదారి కొట్టుకు పోయింది.

Published : 02 Dec 2022 03:25 IST

కొలనుపాక- పటేలుగూడెం రహదారిలోని వాగుపై రైతులు తాత్కాలికంగా రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. ఆగస్టులో వర్షాలకు వాగులో నీటి ప్రవాహ ఉద్ధృతికి సిమెంట్‌ పైపులు, మొరం మట్టితో ఉన్న రహదారి కొట్టుకు పోయింది. దీంతో నాలుగు నెలలుగా ఈ మార్గంలో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. రెండు గ్రామాలకు చెందిన రెండు వందల మంది రైతులు 2 కి.మీ చుట్టూ తిరిగి ఇతర రైతుల భూముల మీదుగా వ్యవసాయ బావులు, పొలాల వద్దకు వెళ్లాల్సి వచ్చింది. పంట కోతల సమయంలో హార్వెస్టర్లు, ట్రాక్టర్లు పంట చేల వద్దకు రాలేని పరిస్థితి నెలకొనడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. అధికారులకు వినతులు అందజేసినా ఫలితం లేకపోయింది. దీంతో సమావేశమైన రైతులు తలా కొంత ఇచ్చిన నగదు రూ.35 వేలతో వాగుపై దారిని ఏర్పాటు చేసుకున్నారు.              

-  ఆలేరు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని