logo

ప్రొఫెసర్‌ని రక్షించిన ఆర్‌పీఎఫ్‌ దళం

విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించిన రైల్వే రక్షక దళం సభ్యులు ఓ ప్రొఫెసర్‌ని రక్షించారు. బుధవారం ఉదయం 11.45 గంటల సమయంలో నల్గొండ జిల్లాకు చెందిన 47 ఏళ్ల ప్రొఫెసర్‌ మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో పట్టాలపైకి చేరుకున్నారు.

Published : 02 Dec 2022 03:25 IST

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించిన రైల్వే రక్షక దళం సభ్యులు ఓ ప్రొఫెసర్‌ని రక్షించారు. బుధవారం ఉదయం 11.45 గంటల సమయంలో నల్గొండ జిల్లాకు చెందిన 47 ఏళ్ల ప్రొఫెసర్‌ మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో పట్టాలపైకి చేరుకున్నారు. రేపల్లె నుంచి సికింద్రాబాద్‌ వైపు వస్తున్న రైలు(17646)కు ఎదురుగా వెళ్లేందుకు యత్నించారు. దీన్ని గమనించిన ఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై హుస్సేన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఫ్లోయిడ్‌ పరుగున వెళ్లి పక్కకు లాగారు. వెంటనే 100 నంబరుకు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి ఆయన్ని వారి కార్యాలయానికి తరలించారు. పోలీసు స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చిన అనంతరం ఇంటికి పంపించారు. కుటుంబ సమస్యల నేపథ్యమే ఆయన ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆర్‌పీఎఫ్‌ సభ్యుల విచారణలో తేలింది. అంతేగాకుండా ఉన్నత చదువులు చదివి పలువురికి విద్యా బోధన చేస్తున్నట్లు తెలుసుకున్నారు. డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ హరప్రసాద్‌, అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ శరత్‌బాబు వారిని ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని