logo

యాదాద్రీశులకు భక్తుల ఆరాధనలు

భక్తవత్సలుడైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని కొలుస్తూ, పూజారులు ఆస్థానపరంగా బిందెతీర్థం, బాలభోగం, హారతి, రాజభోగం, ఆరాధన శనివారం నిర్వహించారు.

Published : 04 Dec 2022 05:00 IST

అష్టోత్తరం నిర్వహిస్తున్న పూజారి

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: భక్తవత్సలుడైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని కొలుస్తూ, పూజారులు ఆస్థానపరంగా బిందెతీర్థం, బాలభోగం, హారతి, రాజభోగం, ఆరాధన శనివారం నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం చేపట్టి మూలవరులకు మేల్కోల్పడంతో నిత్య కైంకర్యాల నిర్వహణకు తెర తొలగించారు. పంచామృతాభిషేకం, తులసీ దళార్చన, లోకశాంతికై శ్రీ సుదర్శన నరసింహ హోమం, కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తుల ఆధ్యాత్మిక ఆహ్లాదానికి గజ వాహనోత్సవాన్ని చేపట్టారు. ఆళ్వారులు కొలువై ఉన్న ఆలయ ముఖమండపంలో అష్టోత్తరం కొనసాగింది. సాయంత్రం వేళ అలంకార జోగు సేవాపర్వం జరిగింది. రాత్రివేళ స్వయంభువులకు ఆరాధన, సహస్ర నామార్చన నిర్వహించారు. పలువురు భక్తులు కొండకింద మండపంలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలను చేపట్టారు. భక్తుల రద్దీ సాధారణంగా నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని