logo

గండి చెరువు.. ఆధ్యాత్మికతకు నెలవు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దే క్రమంలో కొండ కింద గండి చెరువును ఉత్సవాల నిర్వహణకు అనుగుణంగా రూపొందిస్తున్నారు.

Published : 04 Dec 2022 05:00 IST

తెప్పోత్సవ నిర్వహణ ఇక్కడే

యాదాద్రి గండి చెరువుకు చేపట్టిన సుందరీకరణ

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దే క్రమంలో కొండ కింద గండి చెరువును ఉత్సవాల నిర్వహణకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. సుమారు రూ.30 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో చెరువును సుందరీకరిస్తున్నారు. గోదావరి జలాలు నింపేందుకు శనివారం పైపులు వేశారు. ఇక్కడే తెప్పోత్సవం నిర్వహించనుండగా భక్తులు తిలకించేలా చెరువు చుట్టూ మూడంచెల్లో బండ్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెరువులో దిగి హారతి ఇచ్చే భక్తులకు ప్రమాదం జరగకుండా నీటి మట్టంలో నడుం వరకు గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. మెట్ల దారిని నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన ప్రాంగణంగా తీర్చిదిద్దేందుకు పచ్చదన పోషణ చేపట్టారు. సహజత్వానికి నిదర్శనంగా పందిళ్లు, పూలు, ఔషధ మొక్కల పెంపకం చేపట్టారు. మ్యూజికల్‌ వాటర్‌ ఫౌంటెయిన్‌, ఆర్నమెంటర్‌ లైటింగ్‌తో సహా సైకిల్‌ ట్రాక్‌, నడక దారుల ఏర్పాట్లు జరుగుతాయని యాడా అధికారులు చెబుతున్నారు. సదరు పనులు ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన ఈఈ శంకరయ్య పర్యవేక్షిస్తున్నారు.

చెరువు చుట్టూ మెట్ల దారి నిర్మాణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని