ఇంతింతైన విశ్వాసం
నిరంతర సాధనతో పోలీసు ఉద్యోగాలను సాధించడంలో ఆ గ్రామ యువత ముందు వరుసలో ఉంటోంది.
నేరేడుచర్ల: దిర్శించర్లలో అభ్యర్థుల కసరత్తు
నేరేడుచర్ల, న్యూస్‌టుడే: నిరంతర సాధనతో పోలీసు ఉద్యోగాలను సాధించడంలో ఆ గ్రామ యువత ముందు వరుసలో ఉంటోంది. ఎప్పుడు పోలీసు ఉద్యోగాల ప్రకటన వచ్చినా కనీసం డజను మంది ఉద్యోగాలు సాధిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామానికి చెందిన యువత పోలీసు ఉద్యోగాల సాధనలో ముందు వరుసలో ఉంటున్నారు. ఇప్పటికే ఆ గ్రామం నుంచి 100 మందికి పైగా పోలీసు కానిస్టేబుళ్లు, 10 మందికి పైనే ఎస్సైలు, ముగ్గురు సీఐలు, ఒకరు డీఎస్పీగా పని చేస్తున్నారు. వారి స్ఫూర్తితో ఈ ఏడాది పోలీసు కొలువుల కోసం నిర్వహించిన రాత పరీక్షలో ఈ గ్రామం నుంచి 70 మంది అర్హత సాధించారు. ఈవెంట్స్‌లోనూ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించేందుకు శ్రమిస్తున్నారు. గ్రామంలో సరైన క్రీడా ప్రాంగణం లేక పోవడంతో జాన్‌పహాడ్ మేజర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోనే సాధన చేస్తున్నారు.
ఫిట్నెస్ కోసం అభ్యర్థుల నిత్య సాధన
ఎస్సై ఉద్యోగం సాధిస్తా
- పంగ నవ్య
మా బంధువుల్లో కొందరు ప్రస్తుతం కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నారు. నేను బీఏ చదివాను. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎస్సై కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. రాత పరీక్షలో అర్హత సాధించా. దేహదారుఢ్య పరీక్షల్లోనూ విజయం సాధించేందుకు రోజు మూడు గంటలపాటు శ్రమిస్తున్నా.
మా కుటుంబీకులే స్ఫూర్తి
-బుడిగె శ్రావణి
మా కుటుంబంలో ఎక్కువ మంది పోలీసు ఉద్యోగాలలో ఉండటంతో వారి స్ఫూర్తితోనే ఈ పరీక్ష రాసి అర్హత సాధించా. బీఎస్సీ చదివా. గ్రామానికి చెందిన పల్ల సైదులు ఇసుక తోలించి ప్రాక్టీస్ చేసుకునేందుకు ఏర్పాటు చేశారు. గ్రౌండ్ బాగు చేయించారు. పీఈటీ రవి సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
సాధనకు సరైన వసతి లేదు
-కల్వకుంట్ల శిరీష
ఎస్సై ఉద్యోగానికి పోటీ పడుతున్నా. రాత పరీక్షలో అర్హత సాధించా. బీఎస్సీ చదివాను. మా గ్రామంలో సరైన క్రీడా ప్రాంగణం లేక పోవడంతో జాన్‌పహాడ్ మేజర్ పక్కన గల ఖాళీ స్థలంలో సాధన చేస్తున్నాం. కొన్ని సార్లు మిర్యాలగూడ పరిధిలోని అవంతీపురం వద్ద సాధన చేసేందుకు వెళుతున్నాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: అంతులేని విషాదం.. భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..!
-
Crime News
Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం.. ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురి మృతి
-
Movies News
Remix Songs: ఆ‘పాత’ మధుర గీతాలు కొత్తగా.. అప్పుడలా.. ఇప్పుడిలా!
-
Sports News
IND vs AUS: అదరగొట్టిన భారత పేసర్లు.. పెవిలియన్‌కు చేరిన ఆసీస్ ఓపెనర్లు
-
World News
Kim jong un: మళ్లీ కుమార్తెతో కనిపించిన కిమ్
-
Ts-top-news News
TSLPRB: ‘ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థులకు’ మరోసారి ఎత్తు కొలతలు