logo

సమీకృతం.. పనులు ఆలస్యం

పురపాలిక ప్రజల సౌకర్యం కోసం ‘సమీకృత మార్కెట్‌’ను ప్రభుత్వం మంజూరు చేసి ఏడాది గడుస్తోంది. నిత్యావసరాలైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు,  మాంసం, చేపల దుకాణాలు ప్రత్యేకంగా మరో వైపు అందుబాటులో ఉంచాలని ఈ మార్కెట్‌కు రూపకల్పన చేశారు.

Published : 05 Dec 2022 06:16 IST

ఒకేచోట 108 కూరగాయలు, పూలు, పండ్లు, మాంసం దుకాణాలు

చౌటుప్పల్‌ సమీకృత మార్కెట్‌ నమూనా

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: పురపాలిక ప్రజల సౌకర్యం కోసం ‘సమీకృత మార్కెట్‌’ను ప్రభుత్వం మంజూరు చేసి ఏడాది గడుస్తోంది. నిత్యావసరాలైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు,  మాంసం, చేపల దుకాణాలు ప్రత్యేకంగా మరో వైపు అందుబాటులో ఉంచాలని ఈ మార్కెట్‌కు రూపకల్పన చేశారు. ప్రభుత్వం నుంచి రూ.4.50 కోట్లు నిధులు మంజూరయ్యాయి. 60 కూరగాయల, 18 పూలు, పండ్లు, 30 మాంసం, చేపల దుకాణాలను నిర్మించేందుకు టెండరు ఖరారు చేసి హైదరాబాద్‌కు చెందిన షీకో ప్రాజెక్ట్స్‌ అనే సంస్థకు నిర్మాణ పనులను అప్పగించారు. పురపాలిక ద్వారా స్థలం సేకరించి ఆ సంస్థకు అప్పగించడంలో తీవ్ర జాప్యం జరిగింది. సుమారు యాభై ఏళ్లుగా అటవీ శాఖ కార్యాలయం నిర్వహిస్తున్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని సమీకృత మార్కెట్‌ నిర్మాణం కోసం కేటాయించాలని పుర పాలకవర్గం నిర్ణయించింది. అటవీశాఖాధికారులు దీనికి విముఖత చేపడంతో వివాదం ఏర్పడింది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్‌ జోక్యం చేసుకుని జిల్లా కలెక్టర్‌ ద్వారా రెండెకరాల స్థలాన్ని సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి కేటాయించారు. మూడు నెలల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాలు రావడంతో కొంత ఆటంకం ఏర్పడింది. ఈ మార్కెట్‌ సముదాయం పూర్తయితే జాతీయ రహదారి పక్కన, సర్వీసు రోడ్ల వెంట నిర్వహిస్తున్న దుకాణాలన్నీ ఒకే చోటుకి చేరతాయి.

చౌటుప్పల్‌లో సాగుతున్న నిర్మాణ పనులు


ఆరు నెలల్లో పూర్తవుతుంది
-వెన్నెల్‌కుమార్‌, సహాయ ఇంజినీర్‌

తొమ్మిది నెలల్లో మార్కెట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని గుత్తేదారు సంస్థతో ఒప్పందం కుదిరింది.  మూడు నెలల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2023 మే నాటికి పూర్తవుతుంది. తొలి దశ బ్లాక్‌లో 60 కూరగాయలు, 18 పూలు, పండ్ల దుకాణాల నిర్మాణ పనులు చేయిస్తున్నాం. ఇది పూర్తయ్యాక మాంసాహార మార్కెట్‌ బ్లాక్‌లో 30 దుకాణాలు నిర్మాణం చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని