logo

ధరణితో పేదలకు తీరని అన్యాయం: శంకర్‌నాయక్‌

ధరణితో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని.. దానిని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు.

Published : 06 Dec 2022 04:09 IST

కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ధరణితో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని.. దానిని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. ధరణి రద్దు, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. భూ రికార్డుల సవరణ పేరుతో ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చి పేదలు సాగుచేసుకుంటున్న భూమిపై హక్కు లేకుండా చేసిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు వారికి అందడంలేదన్నారు. కాంగ్రెస్‌ హయంలో పేదలకు భూమిని ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. టీపీసీసీ సభ్యుడు దుబ్బాక నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ ధరణి పేదలకు శాపంగా మారిందన్నారు. ధరణితో ధనికులకే లాభం తప్ప పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా వర్తింపచేయాలని కోరారు. ధర్నాలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్‌నేత,  పాల్వాయి స్రవంతి, కొండేటి మల్లయ్య, చల్లమల్ల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్‌, గుమ్ముల మోహన్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, తండు సైదులు గౌడ్‌, అమరేందర్‌రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని