logo

బాలశాస్త్రవేత్తలు.. భలే ఆవిష్కరణలు

శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించడానికి ప్రాథమిక స్థాయి నుంచే పట్టు అవసరం. పాఠశాల స్థాయిలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికితేనే భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉంది.

Published : 06 Dec 2022 04:09 IST

సూర్యాపేట, (మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్‌టుడే: శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించడానికి ప్రాథమిక స్థాయి నుంచే పట్టు అవసరం. పాఠశాల స్థాయిలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికితేనే భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉంది. సూర్యాపేట పట్టణంలోని ఏవీఎం హైస్కూల్‌లో మూడు రోజుల పాటు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరగనుంది. తాము రూపొందించిన అంశాలను విద్యార్థులు సోమవారం ఉత్సాహంగా ప్రదర్శించారు. బుధవారం ప్రదర్శన ముగియనుంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల వినూత్న ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం.


ప్రయోగం: రోబో ద్వారా సేవలు

పాఠశాల: ఆదర్శ పాఠశాల(ఇమాంపేట)

విద్యార్థులు: టి.సత్య, ఎం.బిందు

గైడ్‌ టీచర్‌: లింగయ్య

ప్రధాన ఉద్దేశం: కొవిడ్‌-19 లాంటి విపత్కర పరిస్థితులు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు జబ్బు పడిన వ్యక్తి దగ్గరకు ఏమైనా పంపించాలంటే వేరే వాళ్లు అతని దగ్గరకు వెళ్లకుండా ఈ రోబో యంత్రం ద్వారా ఔషధాలు, పండ్లు, తదితర సేవలు అందించవచ్చు. రోబో యంత్రాన్ని ఎక్కడికంటే అక్కడికి వెళ్లేలా ఫోన్‌ ద్వారా ఆపరేట్‌ చెయ్యొచ్చు.


ప్రయోగం: మనుషులు లేకుండా చెత్తను తీసుకెళ్తుంది

పాఠశాల: జడ్పీహెచ్‌ఎస్‌ (పాలవరం)

విద్యార్థులు: ఎం.పార్థివ్‌కృష్ణ, బి.అఖిల్‌

గైడ్‌ టీచర్‌: ఎల్‌.దేవరాజ్‌

ప్రధాన ఉద్దేశం: ఇంట్లో ఉన్న చెత్తను వేరొకరి ప్రమేయం లేకుండా మున్సిపల్‌ వాహనం రాగానే గార్బేజ్‌ ఓవర్‌ఫ్లో డిటెక్ట్‌ ఆటోమెటిక్‌ కనెక్షన్‌ వెహికల్‌ యంత్రం ద్వారా చెత్తబుట్టను ఆటోమెటిక్‌గా డిటెక్ట్‌ చేసుకొని వాహనం దగ్గరికి తీసుకెళ్తుంది.


ప్రయోగం: మిద్దె తోటలో నీటి పునర్వినియోగం

పాఠశాల: జడ్పీహెచ్‌ఎస్‌ గడ్డిపల్లి

విద్యార్థులు: స్టాలిన్‌, నరహరి, గౌతం

గైడ్‌ టీచర్‌: మారం పవిత్ర

ప్రధాన ఉద్దేశం:  మిద్దె బాగా తడిచిపోకుండా ఉండేందుకు బకెట్లలో పోసిన నీరు డ్రైన్‌ అయ్యే చోట కనెక్టర్‌ని పెట్టి పక్కన 11/1 ఇంచుల పైపులోకి నీరు వచ్చేలా చేశాం. ఆ నీరు పైపు చివర బకెట్‌లోకి పడేలా చేశాం. ఈ బకెట్‌లో మోటారు ఏర్పాటు చేసి దానిని డ్రిప్‌ పైప్‌లకు కనెక్ట్‌ చేశాం.


ప్రయోగం: శ్వాసక్రియ, జీర్ణవ్యవస్థ పనితీరును తెలుపుతుంది

పాఠశాల: నవోదయ పాఠశాల (సూర్యాపేట)

విద్యార్థులు: కె.శివ, టి.సుశీల్‌కుమార్‌

గైడ్‌ టీచర్‌: ఎండీ రఫీక్‌, వీరస్వామి

ప్రధాన ఉద్దేశం: మానవుని ముక్కు ద్వారా ఆక్సిజన్‌ సరఫరా వాయునాళం ద్వారా ఊపిరితిత్తులకు, ఎలా వెళ్తుంది. నోటి ద్వారా ఆహారం వాయునాళం ద్వారా జీర్ణవ్యవస్థలోకి వెళ్లి ఆహారం ఎలా జీర్ణమవుతుందో తెలుపుతుంది.


ప్రయోగం: మ్యాన్‌హోల్స్‌ ప్రమాదాల నుంచి రక్షణ

పాఠశాల: జడ్పీహెచ్‌ఎస్‌ పాలవరం

విద్యార్థులు: పి.వీరలక్ష్మీ, ఎం.ఉదయశ్రీ

గైడ్‌ టీచర్‌: వెంకటరాజు

ప్రధాన ఉద్దేశం:  వర్షాలు కురుస్తున్నప్పుడు రహదారులపై మ్యాన్‌హోల్స్‌ కనిపించక వ్యక్తులు ప్రమాదాల బారినపడుతారు. ఈ యంత్రం ద్వారా రహదారులపై ఉన్న మ్యాన్‌హోల్‌ వద్ద సెన్సార్‌ ఏర్పాటు చేసి నీరు మ్యాన్‌హోల్‌ మునిగే వరకు రాగానే ఆటోమెటిక్‌గా లైట్‌ వెలుగుతుంది.  


ప్రయోగం: వ్యవసాయంలో నీటి వృథాను అరికట్టడం

పాఠశాల: జడ్పీహెచ్‌ఎస్‌, చివ్వెంల

విద్యార్థులు: డి.వంశీ, జి.నవదీప్‌

గైడ్‌ టీచర్‌: సీహెచ్‌.గిరిప్రసాద్‌

ప్రధాన ఉద్దేశం: బోరుబావుల కింద పండించే పంటలకు ఆటోమెటిక్‌ స్టార్టర్లను ఏర్పాటు చేసి నీటిని పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు సెన్సార్‌ విధానంతో నీటి వృథాను అరికట్టేలా ప్రయోగం చేశారు. పంట పొలం చివరికి నీళ్లు చేరి తడిగా మారిన వెంటనే సెన్సార్‌ సహాయంతో బోరు మోటారు బంద్‌ అవుతుంది.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు