ప్రబలుతున్న జ్వరాలు.. వణుకుతున్న జనాలు
పారిశుద్ధ్యం లోపించి పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వ్యాధులు ప్రబలుతున్నాయి. కాలువల్లో రోజుల తరబడి మురుగు నిల్వ ఉండి దోమల ఉద్ధృతి పెరుగుతోంది.
ఆలేరు హరిజనవాడ కాలనీలో మురుగు కాలువ ఇలా...
ఆలేరు, న్యూస్‌టుడే: పారిశుద్ధ్యం లోపించి పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వ్యాధులు ప్రబలుతున్నాయి. కాలువల్లో రోజుల తరబడి మురుగు నిల్వ ఉండి దోమల ఉద్ధృతి పెరుగుతోంది. ఫలితంగా మలేరియా, విషజ్వరాలు ప్రబలడంతో పాటు డెంగీ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆలేరు పట్టణం, మండలంలో 50వేల జనాభా ఉంది. 14 గ్రామ పంచాయతీలు, మరో 12 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాల సమయంలో పనితీరులో ఆదర్శంగా నిలుస్తున్న అధికార యంత్రాంగం ఆ తర్వాత నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలోని ఆదర్శనగర్, వడ్డెరబస్తీ, జంగాల కాలనీ, గణేశ్‌నగర్, సిల్క్‌నగర్ ప్రాంతాల్లో దోమల ఉద్ధృతి అధికంగా ఉంది. రైల్వే అండర్‌పాస్ వద్ద, మంతపురి రహదారి పక్కన, ఎస్సీ కాలనీలోని కాల్వలో మురుగు రోజుల తరబడి నిలిచి ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
చర్యలు నామమాత్రం..
ఆలేరు పట్టణంలో పురపాలిక పరంగా దోమల నివారణకు తీసుకున్న చర్యలేమీ కానరావడం లేదు. ప్రజలు నిత్యం ఇళ్లలో మస్కిటో కాయిల్స్ వెలిగించాల్సిన పరిస్థితి. కొలనుపాక, గొలనుకొండ, శారాజీపేట గ్రామాల్లోనూ పారిశుద్ధ్యం పడకేసింది. ఈ గ్రామాలలో ఇప్పటికే పలువురు జ్వరాల బారిన పడ్డారు. కొలనుపాకలో పక్షం రోజులుగా చాలామందికి విషజ్వరాలు సోకాయి. కొందరికి డెంగీ లక్షణాలు ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా 15 ఏళ్లలోపు వారు జ్వరాల బారిన పడుతున్నారు.
అంతకంతకూ దోమల ఉద్ధృతి
- గంధమల్ల పద్మ, కొలనుపాక
గ్రామంలో దోమల ఉద్ధృతి పెరిగింది. 2,4 వార్డుల్లో పందుల సంచారం ఎక్కువైంది. మురుగు కాలువలు రోజుల తరబడి శుభ్రతకు నోచుకోవడం లేదు. పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పది మందికిపైగా విషజ్వరాల బారినపడ్డారు. కొందరికి డెంగీ లక్షణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పారిశుద్ధ్య చర్యలపై దృష్టి
-ఎ.మారుతీప్రసాద్, పుర కమిషనరు, ఆలేరు
పారిశుద్ధ్యం విషయమై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఫాగింగ్ చేపట్టడంతో పాటు, మురుగు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల నివారణ చర్యలు చేపడతాం. గుంతల్లో ఆయిల్ బాల్స్ వేయిస్తున్నాం. ప్రతి శుక్రవారం డ్రై-డే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Gudivada Amarnath: త్వరలో విశాఖ భవిష్యత్తు మారుతుంది: మంత్రి అమర్నాథ్
-
Ap-top-news News
Taraka Ratna: మెదడు సంబంధిత సమస్య మినహా తారకరత్న క్షేమం: విజయసాయిరెడ్డి
-
India News
బడ్జెట్ అంశాలు లీకవడంతో.. పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి
-
Sports News
Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్
-
Ts-top-news News
Samathamurthy: నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు
-
Crime News
Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు