logo

మృత్తికను సంరక్షించుకుంటేనే మనుగడ: కలెక్టర్‌

జీవకోటికి ఆధారమైన భూమిని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

Published : 06 Dec 2022 04:09 IST

భువనగిరిలో చేపట్టిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

భువనగిరి, న్యూస్‌టుడే: జీవకోటికి ఆధారమైన భూమిని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ మృత్తికా దినోత్సవం (వరల్డ్‌ సాయిల్‌ డే) పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణ నుంచి చేపట్టిన ర్యాలీని సోమవారం కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతి ప్రసాదించిన సహజవనరులను కాపాడుకుంటేనే భావితరాలకు మనుగడ ఉంటుందన్నారు. అధిక దిగుబడిపై ఆశతో మితిమీరిన క్రిమిసంహారక మందులు, ఎరువుల వినియోగం వల్ల భూమి సారం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలతో భూకాలుష్యం ఏర్పడి మానవాళి మనుగడకు సవాల్‌ విసురుతోందన్నారు. ఎరువుల వాడకం, జలాల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి రమణి, మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, నాగవర్ధన్‌రెడ్డి, న్యూడైమన్షన్‌ పాఠశాల ప్రతినిధి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్‌ ర్యాలీలో కొంతదూరం నడిచారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణ నుంచి ప్రిన్స్‌ చౌరస్తా మీదుగా భువనగిరి ఖిల్లా వరకు ర్యాలీ కొనసాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని