logo

‘స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా రింగురోడ్డు నిర్మాణం’

రీజినల్‌ రింగు రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టిన  బాధితులకు సంఘీభావంగా తెజస అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పాల్గొన్నారు.

Published : 06 Dec 2022 04:09 IST

కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తున్న కోదండరామ్‌, బాధితులు

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: రీజినల్‌ రింగు రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టిన  బాధితులకు సంఘీభావంగా తెజస అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. రాయగిరి నుంచి రీజినల్‌ రింగు రోడ్డు అలైన్‌మెంట్‌ కార్పొరేట్‌, బడా రియల్‌ వ్యాపారులకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. రైతులకు ఉన్న కొద్దిపాటి భూమిని అభివృద్ధి పేరుతో రహదారుల విస్తరణకు, హైటెన్షన్‌ విద్యుత్తు వైర్ల నిర్మాణానికి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కొంత భాగం కోల్పోతున్నారన్నారు. రూ.కోట్ల విలువ చేసే భూములకు ప్రభుత్వం నామమాత్రంగా పరిహారం ప్రకటించి నిలువు దోపిడీ చేస్తుందన్నారు. అలైన్‌మెంట్‌ను మార్చి గతంలో నిర్ణయించిన ప్రకారంగా నిర్మాణం చేపట్టాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని