రాష్ట్రపతి ముర్ము వచ్చేస్తున్నారు..!
పంచనారసింహులతో స్వయంభూ మహాదివ్య పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి సందర్శనకు దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెలలో రానున్నారు.
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: పంచనారసింహులతో స్వయంభూ మహాదివ్య పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి సందర్శనకు దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెలలో రానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఖరారైనందున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ‘యాడా’ యంత్రాంగం స్థానికంగా రహదారులను మెరుగుపర్చేందుకు నడుం బిగించనుంది. రాష్ట్రపతి బస చేసేందుకు ప్రెసిడెన్షియల్ భవన సముదాయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు. కొండపైన బాలాలయం చెంత సరికొత్తగా రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం. ఈ క్షేత్రాన్ని ఇప్పటి వరకు నలుగురు రాష్ట్రపతులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.శంకర్‌దయాళ్‌శర్మ, ప్రణబ్‌ముఖర్జీ సందర్శించారు.ఈ క్షేత్రం ఖ్యాతిని మరింత పెంచారు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాకతో అయిదుగురు రాష్ట్రపతులు క్షేత్రాన్ని సందర్శించినట్లవుతుంది.
* తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ క్షేత్రాభివృద్ధి పనులకు ముందస్తుగా 2015 జులై 5న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పంచనారసింహుల ఆలయాన్ని సందర్శించి దైవదర్శనం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఈ క్షేత్రాభివృద్ధి గురించి వివరించి, రూపొందనున్న దేవాలయం నమూనాలు చూపించి, కితాబు పొందారు. రాష్ట్రపతి రాకతో యాదాద్రి పుణ్యక్షేత్రం విశిష్టత, ఖ్యాతి నలుదిశలా వ్యాపిస్తుందని యాదాద్రి దేవాలయాభివృద్ధి ప్రాధికార సంస్థ ఛైర్మన్ కిషన్‌రావు ‘న్యూస్‌టుడే’తో అన్నారు.
పునర్నిర్మితమైన యాదాద్రి క్షేత్రం
తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
ప్రణబ్‌ముఖర్జీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్
-
Movies News
Vani jayaram: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
India News
Modi: మోదీనే మోస్ట్ పాపులర్.. బైడెన్, రిషి సునాక్ ఏ స్థానాల్లో ఉన్నారంటే..?