logo

ఆలోచనే.. ఆవిష్కరణై

తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌-2022లో విద్యార్థులు ప్రతిభ చాటారు.

Published : 06 Dec 2022 04:09 IST

రాష్ట్రస్థాయికి ఐదు ప్రాజెక్టులు ఎంపిక
- భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే:

తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌-2022లో విద్యార్థులు ప్రతిభ చాటారు. ‘ ఆరోగ్యం శ్రేయస్సుకు పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం’ అంశంతో నిర్వహించిన పోటీలకు జిల్లా పరిధిలోని 37 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు 144 మంది 72 ప్రాజెక్ట్‌లను సమర్పించారు. అయిదు ప్రదర్శనల ప్రాజెక్ట్‌ రిపోర్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి.


గది పర్యావరణ వ్యవస్థ కోసం ఆరోగ్యకరమైన తరగతి ప్రాజెక్ట్‌ను చూపుతున్న మహ్మద్‌ అలీ, అఖిలేష్‌

ప్రాజెక్ట్‌ పేరు: గది పర్యావరణ వ్యవస్థ కోసం ఆరోగ్యకరమైన తరగతి

విద్యార్థుల పేర్లు, తరగతి: మహ్మద్‌ అలీ, అఖిలేష్‌, తొమ్మిదో తరగతి

పాఠశాల: జడ్పీహెచ్‌ఎస్‌, బీబీనగర్‌

వివరణ: తరగతి గదిలో వినియోగించే బోర్డు నుంచి సుద్ద దుమ్ము బయటికి రాకుండా ఉంటుంది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆరోగ్యపూర్వకంగా ఉంటుంది.


నీటి శుద్ధి యంత్రాల కచ్చితత్వం ప్రాజెక్ట్‌ను ప్రదర్శిస్తున్న సాయి, విష్ణు

ప్రాజెక్ట్‌ పేరు: నీటి శుద్ధి యంత్రాల కచ్చితత్వం

విద్యార్థుల పేర్లు, తరగతి: సాయి, విష్ణు, ఎనిమిదో తరగతి

పాఠశాల: మోడల్‌ స్కూల్‌, బొమ్మలరామారం

వివరణ: నీటి శుద్ధీకరణ పద్ధతులను అధ్యయనం చేసి ప్రాజెక్ట్‌ను తయారు చేశారు. రివర్స్‌ ఆస్మోసిస్‌ నీటి శుద్ధీకరణ యంత్రాల వల్ల లాభ, నష్టాలు వివరిస్తూనే మిషన్‌ భగీరథ నీటితో కలిగే ప్రయోజనాలను ప్రాజెక్ట్‌లో వివరించారు.


ప్రాజెక్ట్‌ పేరు: వరద ప్రాంతాల కోసం తేలియాడే ఇల్లు

విద్యార్థుల పేర్లు, తరగతి: శివకార్తీక్‌రెడ్డి, భగత్‌, తొమ్మిదో తరగతి

పాఠశాల: శ్రీరామకృష్ణ విద్యాలయం, ఆలేరు

వివరణ: సముద్ర తీరాల్లో వరదలు సంభవించినప్పుడు ఇల్లు మునిగిపోకుండా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించవచ్చు. ఇంటి పునాదుల్లో ఒక రకమైన బెలూన్‌ వంటి నిర్మాణంతో ఇల్లు తేలే విధంగా రూపొందించారు. తేలికైన పదార్థాలతో గోడలు నిర్మాణం చేయవచ్చని వివరించారు.


ప్రాజెక్ట్‌ పేరు: సహజ బ్యాండ్‌ ఎయిడ్‌

విద్యార్థుల పేర్లు, తరగతి: వాణి, భవిత, ఏడో తరగతి

పాఠశాల: జడ్పీహెచ్‌ఎస్‌, నారాయణపూర్‌

వివరణ: ఔషధ గుణాలు ఉన్న చెట్ల ఆకులు నూరి ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెట్టి కాటన్‌ బట్టలో చుట్టడం ద్వారా బ్యాండెయిడ్‌ను రూపొందించారు. యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. దీని తయారీకి ఎటువంటి ఖర్చు లేదు.


ప్రాజెక్ట్‌ పేరు: స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కోసం ఆటోమెటిక్‌ యూరినల్‌ టాయిలెట్‌ ఫ్లషర్‌

విద్యార్థుల పేర్లు, తరగతి: పబ్బు నిక్షిప్త, భావన, తొమ్మిదో తరగతి

పాఠశాల: గాయత్రి ఉన్నత పాఠశాల, వలిగొండ

వివరణ: పరిమిత నీటి వనరులతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. నాలుగు లీటర్ల నీటి వినియోగంతో టాయిలెట్‌, యూరినల్స్‌ను శుభ్రం చేయవచ్చు. ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్లతో తక్కువ నీటి వినియోగంతో మరుగుదొడ్డిని శుభ్రం చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని