logo

మనస్తాపంతో వ్యాపారి ఆత్మహత్య

ధాన్యం కొనుగోలు విషయంలో ఏర్పడిన  ఘర్షణలో  మనస్తాపానికి గురై ఓ వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దవూర మండలం జయరాంతండాలో జరిగింది.

Published : 06 Dec 2022 04:09 IST

రమావత్‌ లాలు ఇంటి వద్ద మృతుని బంధువుల ఆందోళన

పెద్దవూర (రూరల్‌), న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు విషయంలో ఏర్పడిన  ఘర్షణలో  మనస్తాపానికి గురై ఓ వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దవూర మండలం జయరాంతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనునాయక్‌(35) జయరాంతండాలో  ధాన్యం కొనుగోలు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గత నెల 18న ఇదేతండాకు రమావత్‌ లాలు అనే రైతు వద్ద ధాన్యం కొనుగోలు చేశాడు.  డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తగాదా చోటుచేసుకొంది. ఆదివారం సాయంత్రం పంచాయితీ జరుగుతుండగా ధాన్యానికి సంబంధించిన డబ్బుల చిట్టిని శ్రీను చించివేయడంతో  వివాదం మొదలైంది.  ఈ విషయమై రమావత్‌ లాలు, తన భార్యతో వచ్చి శ్రీను, అతని భార్య సుజాతపై దాడి చేశారు. మనస్తాపం చెందిన శ్రీను ఆదివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీను మృతికి లాలు కారణమని అతని ఇంటి వద్ద మృతదేహంతో బంధువులు సోమవారం ఆందోళన చేపట్టారు. నాగార్జునసాగర్‌ సీఐ నాగరాజు, పెద్దవూర ఎస్సై పరమేష్‌ ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు