logo

అక్రమ వసూళ్లకు కళ్లెం

ఉమ్మడి జిల్లాలో ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల పంపిణీలో అక్రమాలకు చెక్‌పడింది. అర్హత ఉన్న 8,13,215 లబ్ధిదారుల నుంచి దాదాపు రూ.8.13కోట్లు అక్రమంగా వసూళ్లు చేసి జేబులు నింపు కోవాలనుకున్న అక్రమదారులకు ‘ఈనాడు’ కథనం ద్వారా అడ్డుకట్ట వేసినట్లైంది.

Published : 22 Jan 2023 06:25 IST

ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులపై విచారణ


చర్లపల్లిలో ఆయుష్మాన్‌ భారత్‌ అర్హులతో మాట్లాడుతున్న సీఎస్‌సీ జిల్లా మేనేజర్‌ ముకరం హైమద్‌

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల పంపిణీలో అక్రమాలకు చెక్‌పడింది. అర్హత ఉన్న 8,13,215 లబ్ధిదారుల నుంచి దాదాపు రూ.8.13కోట్లు అక్రమంగా వసూళ్లు చేసి జేబులు నింపు కోవాలనుకున్న అక్రమదారులకు ‘ఈనాడు’ కథనం ద్వారా అడ్డుకట్ట వేసినట్లైంది. ఉమ్మడి జిల్లాలో ఉచితంగా సరఫరా చేయాల్సిన ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల పంపిణీలో ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.100 చొప్పున చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీనిపై ‘ఈనాడు’లో శుక్రవారం ‘ప్రయోజనం ఒకలా.. ప్రచారం మరోలా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి సీఎస్‌సీ సంస్థ జిల్లా మేనేజర్‌ ఎండీ.ముకరం హైమద్‌ శనివారం నల్గొండ జిల్లా పరిధిలోని చర్లపల్లిలో విచారణ చేపట్టారు. లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులకు విచారణ నివేదిక పంపడంతో పాటు వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమంగా డబ్బులు వసూళ్లు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని