ఎందుకో.. ఏమో.. అనుసంధానం కావట్లే..!
నకిలీ, డబుల్ ఓట్లను అరికట్టాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యల్లో ప్రధానమైన ఓటుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో మందకొడిగా సాగుతుంది.
పలు నియోజకవర్గాల్లో మందకొడిగా ప్రక్రియ
మిర్యాలగూడలో ఓటరు అనుసంధానం చేస్తున్న దృశ్యం
మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: నకిలీ, డబుల్ ఓట్లను అరికట్టాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యల్లో ప్రధానమైన ఓటుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో మందకొడిగా సాగుతుంది. ఫారం- 6బీ ద్వారా ఓటుకు ఆధార్ అనుసంధానం చేస్తుండగా..నిరక్షరాస్యులకు అర్ధమయ్యేలా బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పిస్తూ ప్రక్రియను చేపడుతున్నారు. ఓటుకు ఆధార్ అనుసంధానికి మార్చి 31 వరకు గడువు ఉండగా.. ప్రస్తుతం ప్రక్రియ అంత ఆశాజనకంగా సాగట్లేదు.
అంతంత మాత్రంగానే..
ఆగస్టులో ప్రారంభమైన ప్రక్రియ..ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో 83 శాతం, సూర్యాపేట జిల్లాలో 89.09 శాతం, యాదాద్రి జిల్లాలో 90.87 శాతం మాత్రమే పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. తుంగతుర్తి నియోజకవర్గంలో 93.57 శాతం పూర్తై ప్రథమ స్థానంలో ఉండగా.. 69.08 శాతంతో దేవరకొండ నియోజకవర్గం చివరి స్థానంలో ఉంది. నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలంలో 99.31 శాతం ఆధార్ అనుసంధానం పూర్తయింది. దేవరకొండ నియోజకవర్గంలోని గుండ్లపల్లి మండలంలో అతి తక్కువగా 58.57 శాతం మాత్రమే పూర్తయింది. మూడు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న మాడ్గుపల్లి మండలం నల్గొండ నియోజకవర్గ పరిధిలోని ఆధార్ అనుసంధానం వంద శాతం పూర్తి చేసుకుంది. ఆలేరు, గుండాల, జాజిరెడ్డిగూడెం, తిప్పర్తి మండలాల్లో 98 శాతం పూర్తికాగా పలు నియోజకవర్గాలు 80 శాతంలోనే కొనసాగుతున్నాయి.
భయమే కారణమా..?
ఓటుకు ఆధార్‌కార్డు అనుసంధానం చేయడం ఇష్టం లేని వారు పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, జాబ్‌కార్డు, గుర్తింపు కార్డులు వంటి 10 రకాల కార్డుల్లో ఏదో ఒకటి అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అయితే బీఎల్వోలు ఓటరు ఇంటికి వెళ్లి ఆధార్‌కార్డు అడిగినప్పుడు కార్డుతో వీరు ఏమైనా చేస్తారేమోననే భయంతో కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. మరో వైపు ఓటుకు ఆధార్ అనుసంధానం చేయడం స్వచ్ఛందమేనని ఎన్నికల సంఘం సూచించిందని పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు సైతం నిరాకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పది కార్డుల్లో ఒక్క కార్డును సైతం అనుసంధానం చేసేందుకు మరికొంత మంది ఓటర్లు అనాసక్తి చూపుతున్నారని క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతున్నారు.
ఆందోళన అవసరం లేదు
చెన్నయ్య, ఆర్డీవో, మిర్యాలగూడ
బోగస్ ఓట్లను అరికట్టేందుకు ఓటుకు ఆధార్‌కార్డు అనుసంధాన ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఓటర్లు ఆధార్ కార్డులను బీఎల్వోలకు ఇచ్చేందుకు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి రక్షణ చర్యల మధ్య ఆధార్ సంఖ్యను అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తాం. ఒకసారి అంతర్జాలంలో నిక్షిప్తం చేసిన తర్వాత ఆధార్ సంఖ్య సిబ్బందికి సైతం కనిపించదు. అందువల్ల ఎటువంటి భయం అవసరం లేదు. ఆధార్‌కార్డు అనుసంధానం ఇష్టం లేని వారు ఎన్నికల సంఘం గుర్తించిన 10 కార్డులలో ఏదో ఒక దానిని అనుసంధానం చేయొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Eamcet exam: తెలంగాణలో మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్ష
-
Crime News
Uttar Pradesh: యూపీలో ఘోరం.. మృతదేహాన్ని 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు!
-
India News
JEE Main 2023: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల జయభేరి!
-
General News
Ts High court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణ చేసేందుకు సీజే అనుమతి కోరండి: హైకోర్టు
-
India News
Mumbai airport: ముంబయి ఎయిర్‌పోర్టుకు ఉగ్ర బెదిరింపులు