ఓటు వరంలో..యువ తరంగం
యువత ఓట్లే నవభారత్కు పునాదిగా నిలుస్తాయి.ప్రజాస్వామ్యంలో ఓటు శక్తి అపారం. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఇది అత్యంత శక్తివంతమైన సాధనం.
నేడు జాతీయ ఓటరు దినోత్సవం
నల్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే
యువత ఓట్లే నవభారత్కు పునాదిగా నిలుస్తాయి.ప్రజాస్వామ్యంలో ఓటు శక్తి అపారం. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఇది అత్యంత శక్తివంతమైన సాధనం. అక్టోబరు 2023 వరకు 18 ఏళ్లు నిండే వారు ప్రస్తుతం ఓటరుగా నమోదుకు అర్హత సాధిస్తారు. వారందరినీ భారత ప్రజాస్వామ్యం స్వాగతిస్తోంది. ప్రజల చేతిలో వజ్రాయుధం ఓటు. ఎవరినైనా గద్దె ఎక్కించాలన్నా.. దించాలన్నా.. ఓటుతోనే సాధ్యం.
యువతను ఓటర్లను చేర్పించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటుపై యువతకు అవగాహన కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎలక్ట్రోల్ లిటరసీ క్లబ్లను ఏర్పాటు చేసి పాఠశాల, కళాశాల, పోలింగ్ కేంద్రం వారీగా ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగం, ప్రాధాన్యం గురించి విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు భవిష్యత్తులో ఓటు నమోదు, దాని వినియోగం, ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తున్నారు. డిగ్రీ ఆపైన ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు కొత్త ఓటరు నమోదు, ఓటు ప్రాధాన్యం, ఓటు హక్కు వినియోగం గురించి వివరిస్తున్నారు. చదువు మానేసి ఇంటివద్ద ఉంటున్న వారికి పోలింగ్ కేంద్రం వారీగా ఓటుపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 1, జులై 1, అక్టోబరు 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండేవారు కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
23 వేలకు పెరిగిన కొత్త ఓటర్లు
ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గత ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు 23 వేల మంది కొత్తగా ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గత ఏడాది నవంబరు నుంచి డిసెంబరు వరకు నిర్వహించిన ప్రత్యేక సవరణ కార్యక్రమంలో సుమారు 14 వేల మంది కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కొత్త ఓటర్ల సంఖ్య పెరిగింది. అధికంగా మునుగోడు నియోజకవర్గంలో 5485 మంది యువత కొత్తగా ఓటరుగా నమోదు అయ్యారు. తక్కువగా దేవరకొండ నియోజకవర్గంలో 1757 మంది నమోదు చేసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం
-
Movies News
Social Look: ఆ హీరోతో ఫొటో దిగినందుకు ఖుష్బూ సుందర్ ఆనందం.. పులివెందులలో అషు!
-
India News
IndiGo: అత్యవసర ద్వారం కవర్ తొలగింపు యత్నం.. విమానం గాల్లో ఉండగా ఘటన!
-
Technology News
E-Waste: ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్ అడుగులు!
-
General News
TTD: తిరుమలలో ఆగమశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు: రమణ దీక్షితులు
-
Movies News
Rajinikanth: అనుమతి లేకుండా అలా చేస్తే చర్యలు తప్పవు :రజనీకాంత్