logo

యువత చేతిలో దేశ భవిష్యత్తు

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైందని చౌటుప్పల్‌ ఏసీపీ ఎన్‌. ఉదయ్‌రెడ్డి తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్‌లోని శ్రీగాయత్రి డిగ్రీ కళాశాలలో ‘ఈనాడు-ఈటీవీ’.

Updated : 26 Jan 2023 06:26 IST

ఈనాడు-ఈటీవీ అవగాహన సదస్సులో ఏసీపీ ఉదయ్‌రెడ్డి

చౌటుప్పల్‌లో మాట్లాడుతున్న ఏసీపీ ఎన్‌.ఉదయ్‌రెడ్డి

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైందని చౌటుప్పల్‌ ఏసీపీ ఎన్‌. ఉదయ్‌రెడ్డి తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్‌లోని శ్రీగాయత్రి డిగ్రీ కళాశాలలో ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని, ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, ఉత్తమ పౌరులుగా ఎదగాలని తెలిపారు. ఎన్నికల్లో సరైన వ్యక్తులను గుర్తించి ఓటు వేసినట్టయితే వారు సరైన చట్టాలు, ప్రజల సంక్షేమానికి ప్రణాళికలు వేయగల్గుతారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఓటింగ్‌లో అందరూ పాల్గొంటున్నారని తెలిపారు. యువత ఓటింగ్‌లో పాల్గొనొకపోవడం మంచి పరిణామం కాదన్నారు. యువత ప్రతి రోజూ దినపత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆక్షాంక్షించారు. శ్రీగాయత్రి కళాశాల కరస్పాండెంట్‌ భీమిడి సుభాస్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్‌ ఆంజనేయులు, ఎస్సై అనిల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

చౌటుప్పల్‌లో ఈనాడు-ఈటీవీ అవగాహన సదస్సులో పాల్గొన్న శ్రీగాయత్రి కళాశాల విద్యార్థులు


సద్వినియోగం చేసుకోవాలి

ప్రీతి, డిగ్రీ ప్రథమ విద్యార్థిని

కులమతాలకు అతీతంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. ప్రజలకు సేవ చేయాలనే ఉత్తములను గుర్తించి ఓటు వేయాలి. ఓటు హక్కును సరిగా వినియోగించకపోతే అర్హత లేనివాళ్లు అందలం ఎక్కుతారు. నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు