logo

పర్యాటకం.. మాటలకే పరిమితం

దేవరకొండ దుర్గాన్ని రాజధానిగా చేసుకొని వెలమ రాజులు సుమారు 149 సంవత్సరాలు స్వయం ప్రతిపత్తి గల రాజ్యంగా పరిపాలించారని చరిత్రకారులు చెబుతుంటారు.

Published : 27 Jan 2023 06:01 IST

దేవరకొండ ఖిల్లా దుర్గంపైకి వెళ్లే మెట్ల మార్గం

దేవరకొండ, న్యూస్‌టుడే: దేవరకొండ దుర్గాన్ని రాజధానిగా చేసుకొని వెలమ రాజులు సుమారు 149 సంవత్సరాలు స్వయం ప్రతిపత్తి గల రాజ్యంగా పరిపాలించారని చరిత్రకారులు చెబుతుంటారు. 750 ఏళ్ల కిందట దేవరకొండ ఖిల్లా దుర్గం 500 అడుగుల ఎత్తు, 524 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. శత్రు దుర్భేద్యమైన నిర్మాణం, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో పశ్చిమ ప్రాకారానికి రహస్యమార్గం ఉంటుంది. చుట్టూ ఆలయాలతో అష్టదిగ్భంధనం ఉండేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. గిరి దుర్గం, సురగిరి, దేవతల కొండగా ప్రాచుర్యం పొందింది. కవి సార్వభౌముడు శ్రీనాథుడు సాహితి పక్షపాతులైన దేవరకొండ సామ్రాజ్యాధిపతులను కలవడానికి ఖిల్లాకు వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం పట్టించుకునే నాథుడు కరవయ్యారు. మూడేళ్ల క్రితం ఖిల్లా దుర్గాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. రూ.50 లక్షలతో సీసీ రహదారి నిర్మాణం చేపట్టారు. మిగతా రూ.50 లక్షలతో మెట్లను సరిచేయాల్సి ఉన్నప్పటికీ గుత్తేదారు వాటిని గాలికి వదిలేశారు.


త్వరలో గుర్తింపునకు చర్యలు
-రమావత్‌ రవీంద్రకుమార్‌, ఎమ్మెల్యే

దేవరకొండ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా గుర్తించేందుకు అసెంబ్లీలో ప్రస్తావించాను. పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టికి తీసుకెళ్లాను. తొందర్లోనే పర్యాటక కేంద్రంగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని