logo

యాత్రలో ప్రభుత్వాల వైఫల్యాలు వివరిద్దాం: డీసీసీ

ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌గాంధీ సందేశాన్ని చేరవేసేందుకు హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ యాత్ర చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌ అన్నారు.

Published : 27 Jan 2023 06:01 IST

సూర్యాపేటలో హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ యాత్రను ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరిస్తున్న డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, నాయకులు

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌గాంధీ సందేశాన్ని చేరవేసేందుకు హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ యాత్ర చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌ అన్నారు. సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో గురువారం హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ ఆలోచనలు, భావాజాలాన్ని ప్రచారం చేసి యాత్రలో ప్రజలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ శ్రేణులు రెండు నెలల పాటు కష్టపడి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు, ఓబీసీ సెల్‌ వైస్‌ ఛైర్మన్‌ తండు శ్రీనివాస్‌ యాదవ్‌,  ఎస్సీ సెల్‌ వైస్‌ ఛైర్మన్‌ చింతమల్ల రమేశ్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కక్కిరేణి శ్రీనివాస్‌, చెంచల శ్రీనివాస్‌, బెంజారపు రమేశ్‌, సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు