logo

భక్తవత్సలుడికి ఆరాధనలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం భక్తుల ఆర్జిత పూజలు ఆస్థానపరంగా ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవుదినం కావడంతో భక్తులు పలు ప్రాంతాల నుంచి వచ్చి క్షేత్రాన్ని సందర్శించారు.

Updated : 27 Jan 2023 06:29 IST

కల్యాణోత్సవం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం భక్తుల ఆర్జిత పూజలు ఆస్థానపరంగా ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవుదినం కావడంతో భక్తులు పలు ప్రాంతాల నుంచి వచ్చి క్షేత్రాన్ని సందర్శించారు. వేకువజామున సుప్రభాతం చేపట్టి మూలవరులను కొలిచారు. బిందెతీర్థం, బాలభోగం నివేదించాక పూజారులు నిజాభిషేకం, తులసీ అర్చన నిర్వహించారు. భక్తులకు అభయమిస్తూ దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీనారసింహుల కవచమూర్తులకు స్వర్ణ పుష్పార్చన జరిపారు.  లక్ష్మీనారసింహుల నిత్యకల్యాణోత్సవాన్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా చేపట్టి కల్యాణమూర్తులను గజవాహనంపై అలంకృతులను చేసి ఊరేగించారు. ఆలయ మహాముఖమండపంలో అష్టోత్తర పర్వం కొనసాగింది. సాయంత్రం అలంకార జోడు సేవోత్సవం చేపట్టి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. 2236 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి గురువారం నిత్యాదాయం రూ.31,68,671 చేకూరాయని ఈవో తెలిపారు.
యాదాద్రీశుడి సేవలో స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌...  యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఈడిగ ఆంజనేయగౌడ్‌ ప్రభుత్వ విప్‌, స్థానిక ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్‌రెడ్డితో కలిసి గురువారం సందర్శించారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు