logo

నృత్యంలో.. అదుర్స్‌

చిన్ననాటి నుంచి నృత్యంపై మక్కువ, కృషి, పట్టుదలతో రాణిస్తున్నారు దేవరకొండ యువతీయువకులు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జానపద, కూచిపూడి, పేరిణి తాండవం, పంజాబీ నృత్యాల్లో సత్తా చాటుతూ పలువురి మన్ననలు పొందుతున్నారు.

Published : 27 Jan 2023 06:06 IST

హైదరాబాద్‌లో సాంస్కృతిక కార్యక్రమంలో డ్యాన్స్‌ చేస్తున్న దేవరకొండ యువతీ యువకులు

దేవరకొండ, న్యూస్‌టుడే: చిన్ననాటి నుంచి నృత్యంపై మక్కువ, కృషి, పట్టుదలతో రాణిస్తున్నారు దేవరకొండ యువతీయువకులు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జానపద, కూచిపూడి, పేరిణి తాండవం, పంజాబీ నృత్యాల్లో సత్తా చాటుతూ పలువురి మన్ననలు పొందుతున్నారు. పట్టణానికి చెందిన క్రాంతి మాస్టర్‌ ఆధ్వర్యంలో.. లావణ్య, నరహరి పలువురి విద్యనభ్యసిస్తూనే డ్యాన్స్‌లో రాణిస్తున్నారు.


ప్రశంసలు - అవార్డులు

* 2018లో మద్దిమడుగు క్రాంతి నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన డ్యాన్స్‌ బేబిడ్యాన్స్‌లో పాల్గొని ప్రశంసలు, బహుమతులు అందుకున్నారు.

* 2019లో క్రాంతి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జానపద నృత్యంలో తెలంగాణ పాటపై నృత్యం ద్వారా సాంస్కృతిక, సాహిత్య వేదిక అవార్డు పొందారు.

* 2020లో లావణ్య రవీంద్రభారతిలో నిర్వహించిన బతుకమ్మపాటపై ప్రశంసలు పొందడంతో పాటు షీల్డ్‌ను అందుకుంది.


తల్లిదండ్రుల ప్రోత్సాహంతో: లావణ్య

నృత్యంపై మక్కువతో సాధన చేశాను. రాష్ట్రంలో ఎక్కడ పోటీలు జరిగినా జానపద, పేరిణి తాండవంలో రాణిస్తున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎక్కడికైనా వెళ్తున్నాను.


లఘు చిత్రాల్లో నటిస్తూ: నరహరి

ప్రభుదేవా అంటే ఇష్టం. ఆయనపై అభిమానంతో బ్రేక్‌డ్యాన్స్‌ సాధన చేశాను. ప్రస్తుతం లఘు చిత్రాల్లో డ్యాన్సర్‌గా రాణిస్తున్నాను. సినీ రంగంలో డ్యాన్స్‌ మాస్టర్‌గా రాణించడమే ధ్యేయం.


ఎంతో మందిని తీర్చిదిద్దాను
మద్దిమడుగు క్రాంతి, డ్యాన్స్‌ మాస్టర్‌

ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే డ్యాన్స్‌ నేర్చుకున్నాను. వందలాది మంది యువతీ యువకులను డ్యాన్స్‌లో శిక్షణనిచ్చాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని