logo

ఉపాధ్యాయ వైద్యనివేదికల పరిశీలన

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మొదలైంది. శనివారం నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మూడు రోజలు పాటు బదిలీలు కోరుకునే వారు ఆన్‌లైన్‌కు అవకాశం కల్పించారు.

Published : 29 Jan 2023 04:34 IST

డీఈవో కార్యాలయంలో మెడికల్‌ పత్రాలు పరిశీలిస్తున్న వైద్యులు

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మొదలైంది. శనివారం నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మూడు రోజలు పాటు బదిలీలు కోరుకునే వారు ఆన్‌లైన్‌కు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో ఇటీవల కొత్తగా ప్రకటించిన గట్టుప్పల్‌ మండలం కనిపించకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్య సమస్యలతో బాధపడే ఉపాధ్యాయులకు ఫ్రిఫరెన్షియల్‌ కేడర్‌ కింద ధ్రువీకరణకు మెడికల్‌ టీంను ఏర్పాటు చేశారు. డీఈవో కార్యాలయంలో పలువురు వైద్యులు ఉపాధ్యాయుల వైద్యనివేదికలను పరిశీలించారు. ఫ్రిఫరెన్షియల్‌ కేడర్‌ కింద కేన్సర్‌, నరాల, గుండె సర్సరీ, బోన్‌టీబీ, కిడ్నీ, లివర్‌, కుటుంబ సభ్యుల్లో మానసిక వైకల్యం ఉన్నవారు, బ్లడ్‌క్యాన్సర్‌, తలసేమియా, మస్క్యులర్‌ డిస్ట్రోఫి చికిత్సకు సంబంధించిన వారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. వైద్యులు వాటిని పరిశీలించి ధ్రువీకరణ పత్రాలు అందచేశారు. న్యూరోకు సంబంధించి ప్రత్యేక వైద్యులు లేకపోవడంతో .. ఆ సమస్యతో ఇబ్బంది పడేవాళ్లంతా తమకు న్యాయం చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం వరకు వైద్యులు డీఈవో కార్యాలయంలో పరిశీలించి ధ్రువీకరించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు