logo

జపనీస్‌ భాషలో శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తాం: టీవోఎంకం

జపాన్‌లో పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సింగ్‌ విద్యార్థులకు ఆరు మాసాల పాటు జపనీస్‌ భాషలో శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామని తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌(టీవోఎంకం) మేనేజర్‌ నాగభారతి అన్నారు.

Published : 29 Jan 2023 04:06 IST

సూర్యాపేట, (మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్‌టుడే: జపాన్‌లో పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సింగ్‌ విద్యార్థులకు ఆరు మాసాల పాటు జపనీస్‌ భాషలో శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామని తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌(టీవోఎంకం) మేనేజర్‌ నాగభారతి అన్నారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో నర్సింగ్‌ విద్యార్థులకు శనివారం స్క్రీనింగ్‌ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారికి చరవాణి లేదా ఈ మెయిల్‌ ద్వారా సమాచారం తెలియజేస్తామన్నారు. ఎంపికైన వారికి రూ.లక్షకు పైగా వేతనం లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎస్‌.మాధవరెడ్డి, వి.చెన్నయ్య, ఎ.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని