పదోన్నతుల ప్రక్రియ వేగవంతం
జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే జిల్లా పరిధిలో ఖాళీల వివరాలను గుర్తించి ఆ జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టిన విద్యాశాఖ అధికారులు ధ్రువపత్రాల పరిశీలనలో నిమగ్నమయ్యారు.
436 మంది ఎస్జీటీల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి
సూర్యాపేట: ఉపాధ్యాయుల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది
సూర్యాపేట, (మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్‌టుడే: జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే జిల్లా పరిధిలో ఖాళీల వివరాలను గుర్తించి ఆ జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టిన విద్యాశాఖ అధికారులు ధ్రువపత్రాల పరిశీలనలో నిమగ్నమయ్యారు. పదోన్నతికి అర్హులైన ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని అన్ని కేటగిరీల ఎస్జీటీల పది, ఇంటర్, డిగ్రీ, బీఎడ్, అంతర్ జిల్లాల బదిలీ, నోటీసు, కుల ధ్రువపత్రాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు శనివారం పరిశీలించారు. ఈ పరిశీలనకు 436 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. వీరిలో 36 మంది ఉపాధ్యాయులకు బీఎడ్ ధ్రువపత్రం లేకపోవడం, సర్వీసు పుస్తకంలో ఎంట్రీ కాకపోవడం వంటి కారణాలతో అభ్యంతరాలను స్వీకరించారు. తదుపరి ఉద్యోగోన్నతులకు సంబంధించి ప్రత్యేక కేటగిరీల వారీగా జాబితా తయారు చేసి సూర్యాపేట వైద్య కళాశాలకు పంపామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని