logo

నేడు యాదాద్రి కొత్త బస్‌ స్టేషన్‌ ప్రారంభం

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా కొండ దిగువన లక్ష్మీ పుష్కరిణి పక్కన చేపట్టిన నూతన ప్రయాణ ప్రాంగణం బుధవారం ప్రారంభం కానుంది.

Published : 01 Feb 2023 05:33 IST

ప్రారంభానికి సిద్ధమైన యాదాద్రి నూతన బస్‌స్టేషన్‌

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా కొండ దిగువన లక్ష్మీ పుష్కరిణి పక్కన చేపట్టిన నూతన ప్రయాణ ప్రాంగణం బుధవారం ప్రారంభం కానుంది. రూ.6.50 కోట్లతో ఈ బస్‌ స్టేషన్‌ను నిర్మాణం చేశారు. 8,600 చ.అ. విస్తీర్ణంలో నిర్మితమైన ఈ బస్‌ స్టేషన్‌లో 10 ప్లాట్‌ఫాంలు, ఆరు దుకాణ గదులు, హోటల్‌ కోసం ఒక గది, క్లాక్‌రూం, కార్గో కోసం ఒక గది, స్రీ, పురుషులకు వేర్వేరుగా శౌచాలయాలు ఉన్నాయి. మంచి నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అంతా సిద్ధమైన ఈ బస్‌ స్టేషన్‌ను బుధవారం ప్రారంభించడానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌, రైబస రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌, జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలా సత్పతి తదితరులు రానున్నట్లుగా డీఎం శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని