logo

ఒక్కరోజు.. ఊరంతా ఖాళీ

చందుపట్ల గ్రామాన్ని బుధవారం గ్రామస్థులందరు మూకుమ్మడిగా ఖాళీ చేశారు. వ్యవసాయ బావులు, భూములు, శివారు ప్రాంతాలకు తరలివెళ్లారు.  

Published : 02 Feb 2023 05:08 IST

చందుపట్ల గ్రామ ప్రధాన వీధి నిర్మానుష్యంగా ఇలా..

నకిరేకల్‌, న్యూస్‌టుడే: చందుపట్ల గ్రామాన్ని బుధవారం గ్రామస్థులందరు మూకుమ్మడిగా ఖాళీ చేశారు. వ్యవసాయ బావులు, భూములు, శివారు ప్రాంతాలకు తరలివెళ్లారు.  చెట్లకిందే వంటావార్పు చేశారు. సాయంత్రం గ్రామం బాట పట్టారు. ఉదయం తెల్లవారుతుండగానే..ఇళ్ల ముందు కళ్లాపి కూడా చల్లకుండా గ్రామాన్ని విడిచారు.గ్రామంలో వరుస మరణాలు జరుగుతుండటమే ఇందుకు కారణం. గ్రామంలోని రెండు ప్రభుత్వ ప్రాథమిక, ఒక ఉన్నత పాఠశాల కూడా మూతపడటం గమనార్హం. కంటి వెలుగు శిబిరాన్ని మాత్రం కొనసాగించారు. 11 మంది మాత్రమే కంటి పరీక్షలకు వచ్చారు. గ్రామం మొత్తం ఖాళీ కావడంతో గ్రామంలో చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇద్దరు కానిస్టేబుళ్లు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని