logo

పరామర్శకు వెళ్తూ.. తల్లీకుమారుల దుర్మరణం

అనారోగ్యానికి గురైన అత్తను పరామర్శించేందుకని వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురై తల్లీకుమారుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై బుధవారం జరిగింది.

Published : 02 Feb 2023 05:08 IST

పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే: అనారోగ్యానికి గురైన అత్తను పరామర్శించేందుకని వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురై తల్లీకుమారుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామానికి చెందిన గుంజి ఎలమంద, భార్య వెంకాయమ్మ(35)లు 20 ఏళ్ల క్రితం దేవరకొండ మండలం తాటికొల్లుకు వచ్చి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వగ్రామం కొప్పురంలో వెంకాయమ్మ అత్త అనారోగ్యానికి గురవడంతో ఆమెను చూసేందుకు కుమారుడు గణేశ్‌(19)తో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో పీఏపల్లి మండలం చిలమర్రిస్టేజీవద్దకు రాగానే ఎదురుగా పెద్దవూర వైపు నుంచి వేగంగా వస్తున్న కారు వీరి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన వెంకాయమ్మ, గణేశ్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమైంది. భర్త ఎలమంద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.రంజిత్‌రెడ్డి తెలిపారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు