logo

రాజకీయాల కోసం దేవున్ని వాడుకోం: మంత్రి

భక్తి భావనతో నిర్మించిన ఆలయం యాదాద్రి అని, మిగతా వారిలాగా రాజకీయాలు, ఓట్ల కోసమో దేవుడిని వాడుకునే విధానం తమ ప్రభుత్వానిది కాదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు

Updated : 02 Feb 2023 06:21 IST

యాదాద్రి నూతన బస్‌స్టేషన్‌ను పరిశీలిస్తున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పక్కన ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తదితరులు

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: భక్తి భావనతో నిర్మించిన ఆలయం యాదాద్రి అని, మిగతా వారిలాగా రాజకీయాలు, ఓట్ల కోసమో దేవుడిని వాడుకునే విధానం తమ ప్రభుత్వానిది కాదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా లక్ష్మీ పుష్కరిణి చెంత నూతనంగా నిర్మించిన బస్‌స్టేషన్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రానున్న రోజుల్లో ఈ క్షేత్రానికి రోజుకు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు, వసతుల కల్పన జరుగుతుందన్నారు.   అనుకున్న సమయం కంటే ముందే అద్భుతమైన రీతిలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. దేశ ప్రజలంతా తెలంగాణ వైపు చూస్తున్నారని, కేసీఆర్‌ నాయకత్వం తమకు కూడా కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఆవరణలో జల ప్రసాద కేంద్రాన్ని ప్రారంభించారు.  కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఆర్టీసీ ఈడీ పురుషోత్తంనాయక్‌, ఆర్‌ఎం శ్రీదేవి, డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి , జడ్పీటీసీ సభ్యురాలు అనురాధ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని