logo

ఇద్దరు యువకులను బలిగొన్న అతివేగం

అతి వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

Published : 05 Feb 2023 06:16 IST

ప్రశాంత్‌, నవీన్‌

కొడకండ్ల, నాగారం, న్యూస్‌టుడే: అతి వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శనివారం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయిలోని పెట్రోల్‌బంక్‌ వద్ద జనగామ-సూర్యాపేట ప్రధాన రహదారిపై జరిగింది. కొడకండ్ల ఎస్సై కొంరెల్లి కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామానికి చెందిన నాతి ప్రశాంత్‌ (19), బొడ్డు నవీన్‌ (20) చిన్ననాటి నుంచి స్నేహితులు. ఒకే పాఠశాలలో విద్యనభ్యసించిన వీరు ప్రస్తుతం తిరులగిరిలో డిగ్రీ చదువుతున్నారు. ప్రశాంత్‌ ఖాళీ సమయాల్లో జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. వారిద్దరూ శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఫణిగిరి నుంచి దేవరుప్పులకు వెళ్తుండగా.. జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టడంతో మరణించారు. ద్విచక్రవాహనం ధ్వంసం కాగా మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. ఇద్దరివీ వ్యవసాయాధారిత కుటుంబాలే. ప్రశాంత్‌ తల్లిదండ్రులకు ఆయన ఒక్కడే కుమారుడు కాగా మరో కుమార్తె ఉంది. నవీన్‌కు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు ఉన్నారు. ఇద్దరి మృతితో ఫణిగిరిలో విషాదఛాయలు అలముకున్నాయి. చేతికి అందివచ్చిన కొడుకులు మరణించడంతో వారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. దేవరుప్పుల, కొడకండ్ల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను జనగామ ఆసుపత్రికి తరలించారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని