logo

జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సూర్యాపేట పురపాలిక పరిధిలోని దురాజ్‌పల్లిలో ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే పెద్ద(గొల్ల)గట్టు జాతరకు ఆర్టీసీ సంస్థ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడపనుంది.

Published : 05 Feb 2023 06:07 IST

కుడకుడరోడ్డు(సూర్యాపేట), న్యూస్‌టుడే: సూర్యాపేట పురపాలిక పరిధిలోని దురాజ్‌పల్లిలో ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే పెద్ద(గొల్ల)గట్టు జాతరకు ఆర్టీసీ సంస్థ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడపనుంది. హైదరాబాద్‌తో పాటు హన్మకొండ, తొర్రూరు, దంతాలపల్లి, మహబూబాబాద్‌, మరిపెడబంగ్లా, నల్గొండ, ఖమ్మం, మిర్యాలగూడ, కోదాడ, నకిరేకల్‌ నుంచి బస్సు సర్వీసులు నడపనున్నట్లు సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ సురేందర్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.  

సర్వీసుల వివరాలు..

* హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు సర్వీసు ఉంటుంది.

* హన్మకొండ, తొర్రూర్‌, దంతాలపల్లి నుంచి సూర్యాపేటకు ప్రతి 20 నిమిషాలకు ఒకటి.

* జనగామ, తిరుమలగిరి నుంచి సూర్యాపేటకు ప్రతి 20 నిమిషాలకో సర్వీసు.

* మహబూబాబాద్‌, బంగ్లా నుంచి సూర్యాపేటకు ప్రతి 20 నిమిషాలకు..

* నల్గొండ నుంచి సూర్యాపేట, జాతరకు ప్రతి 15 నిమిషాలకు..

* ఖమ్మం నుంచి సూర్యాపేటకు ప్రతి 15 నిమిషాలకు..

* మిర్యాలగూడ-భీమారం నుంచి జాతరకు ప్రతి 20 నిమిషాలకు  

* నేరేడుచర్ల నుంచి జాతరకు ప్రతి 10 నిమిషాలు

* నకిరేకల్‌ నుంచి జాతరకు ప్రతి 30 నిమిషాలకు ఒక సర్వీసు నడపనున్నారు.

సూర్యాపేట నుంచి జాతరకు... సూర్యాపేట పట్టణంలోని కొత్తబస్టాండు, పాతబస్టాండు, పీఎస్సార్‌ సెంటర్‌, కుడకుడ క్రాస్‌రోడ్డు, ఖమ్మం చౌరస్తా నుంచి జాతరకు ప్రతి 5 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది.

ధరలు ఇలా..

సూర్యాపేట పట్టణంలోని కొత్తబస్టాండ్‌ నుంచి 20, పాతబస్టాండ్‌ నుంచి 15, పీఎస్సార్‌ సెంటర్‌ నుంచి ఐదు, ఖమ్మం చౌరస్తా నుంచి ఐదు బస్సు సర్వీసులను నడపనున్నట్లు సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ సురేందర్‌ తెలిపారు. ఇవి జాతర జరిగే 5, 6 తేదీల్లో రెండ్రోజుల పాటు ప్రతి పది నిమిషాలకు, అనంతరం మరో రెండ్రోజులు 20 నిమిషాలకు ఒకటి చొప్పున తిరుగుతాయని పేర్కొన్నారు. మిర్యాలగూడ, కోదాడ నుంచి దురాజ్‌పల్లి చౌరస్తా సమీపంలో బస్సు ప్రాంగణం వరకు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

జాతర స్పెషల్‌ ఛార్జీలు
ఆర్టీసీ ప్రాంగణం పెద్ద(గొల్ల)గట్టు జాతర పిల్లలు పెద్దలు
సూర్యాపేట దురాజ్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌ రూ.20 రూ.30


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని