logo

ఆనందోత్సవాలతో మకరతోరణం తరలింపు

పెద్దగట్టు జాతర సందర్భంగా శ్రీలింగమంతుల స్వామివారికి అలంకరించే మకరతోరణం శోభాయాత్రను శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్లబజారులో శనివారం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వట్టెజానయ్య యాదవ్‌తో కలిసి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు.

Published : 05 Feb 2023 06:16 IST

శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేటలో భేరి మోగిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వట్టె జానయ్య యాదవ్‌

సూర్యాపేట సాంస్కృతికం, న్యూస్‌టుడే: పెద్దగట్టు జాతర సందర్భంగా శ్రీలింగమంతుల స్వామివారికి అలంకరించే మకరతోరణం శోభాయాత్రను శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్లబజారులో శనివారం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వట్టెజానయ్య యాదవ్‌తో కలిసి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. వారంతా భేరీలు మోగిస్తూ సందడి చేశారు. ఏటా జాతర ప్రారంభానికి ముందస్తుగా మకరణతోరణాన్ని తరలించడం, జాతర ముగిశాక తిరిగి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. తొలుత గొల్లబజారులో భక్తిశ్రద్ధలతో మకరతోరణానికి పూజలు చేసి గట్టుకు తరలించారు. యాదవులు ఆనందంతో నృత్యాలు చేస్తూ ఆలయ్‌బలయ్‌ తీసుకున్నారు.

భాజపావి ఓట్ల రాజకీయాలు: మంత్రి

ఓట్ల కోసం రాజకీయాలు చేసే పార్టీ భాజపా అని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలో లింగమంతుల స్వామి మకరతోరణం శోభాయాత్రను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి గౌరవాన్ని తగ్గించేందుకు ఆ పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గవర్నర్‌తో అబద్ధాలు మాట్లాడించామంటున్న భాజపా నేతలు ఇన్ని రోజులు వారు అబద్ధాలు మాట్లాడించారని తాము భావించాలా అని ప్రశ్నించారు. గవర్నర్‌ ప్రసంగాన్ని వ్యతిరేకించడమంటే ఆ స్థానాన్ని అవమానించినట్టేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, భారాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని