logo

జన గట్టు

సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న దురాజ్‌పల్లి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరలో రెండో రోజు గట్టుతో పాటు పరిసర ప్రాంతాలు మొత్తం భక్తజనంతో నిండిపోయాయి.

Published : 07 Feb 2023 06:22 IST

- చివ్వెంల, న్యూస్‌టుడే

సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న దురాజ్‌పల్లి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరలో రెండో రోజు గట్టుతో పాటు పరిసర ప్రాంతాలు మొత్తం భక్తజనంతో నిండిపోయాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో గట్టు చెంతకు చేరుకున్న భక్తులు లింగమంతులస్వామి, చౌడమ్మతల్లి దేవత ఆలయాల చుట్టూ ఓ లింగా.. నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేసి లింగమంతులస్వామికి బోనాలు, చౌడమ్మతల్లికి (యాటపోతులను బలిచ్చి)
మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు దేవుళ్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హక్కుదార్లుగా ఉన్న యాదవ (మెంతబోయిన, మున్న) వంశస్థులు ఆచారం ప్రకారం జాగిలాలకు బోనం అందించి, సంప్రదాయబద్ధంగా ప్రసాదాన్ని ఆరగించారు. రాష్ట్ర మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ తదితరులు లింగమంతులస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్‌కు పలుమార్లు అంతరాయాలు ఏర్పడ్డాయి. పార్కింగ్‌ వసతి సక్రమంగా లేకపోవడం సమస్యలకు దారితీసింది.

లింగమంతులస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని