logo

నైపుణ్య పెంపే లక్ష్యంగా..!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలకు కొరత లేదు. అయితే వీటిని అందిపుచ్చుకోవాలంటే కేవలం చదువు ఒక్కటే సరిపోదు. నైౖపుణ్యాలు పెంచుకోవడం ముఖ్యం.

Published : 07 Feb 2023 06:22 IST

నల్గొండకు మోడల్‌ కెరీర్‌ కేంద్రం మంజూరు
నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే

ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలకు కొరత లేదు. అయితే వీటిని అందిపుచ్చుకోవాలంటే కేవలం చదువు ఒక్కటే సరిపోదు. నైౖపుణ్యాలు పెంచుకోవడం ముఖ్యం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిశ్రమలు అధికంగా ఉన్నా.. నైపుణ్యాల లేమితో యువత అవకాశాలను అందుకోలేకపోతోంది. దీంతో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో యువతలో నైపుణ్యాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నల్గొండకు మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ (ఎంసీసీ)ను మంజూరు చేసింది. నల్గొండ జిల్లాలో అత్యధిక పరిశ్రమలున్నాయి. రాజధానికి సమీపంలో ఉండటంతో ఐటీ రంగంలోనూ యువత అవకాశాలు దక్కించుకునేందుకు వీలుంది. నైపుణ్యాల లేమితో ఉద్యోగ, ఉపాధిలో వెనుకబడుతున్న నిరుద్యోగులకు ఈ కేంద్రంతో ప్రయోజనం చేకూరనుంది.

ఉపాధి కల్పన కార్యాలయానికి కొత్తరూపు..

మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ ద్వారా యువతకు శిక్షణ ఇవ్వటానికి ప్రత్యేక భవనం అవసరం. దానికి కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షలు కేటాయించింది. నల్గొండలోని ఉపాధి కల్పన కార్యాలయాన్ని విస్తరించితే సెంటర్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది. ఇంజినీరింగ్‌ శాఖ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ఆధునికీకరణ చేసేందుకు అంచనాలు రూపొందించారు.

ఉచిత శిక్షణతో ఉపాధికి బాటలు..

మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ సేవలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుంది. సంస్థలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనుండటంతో ఉపాధికి బాటలు పడనున్నాయి. నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో నల్గొండకు ఇది మంజూరైంది. యువతకు ఇక్కడ ఉపాధి కల్పనకు శిక్షణ ఇవ్వనున్నారు.


యువతకు ఉపయోగకరం
- పద్మ, జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారిణి, నల్గొండ

మోడల్‌ కెరీర్‌ కేంద్రం ఏర్పాటు యువతకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధి కల్పన కార్యాలయం భవనాన్ని ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో శిక్షణ కేంద్రానికి అనుగుణంగా విస్తరింప చేసి ఇందులో నిర్వహిస్తాం. పాలనాధికారి నుంచి పరిపాలన అనుమతులు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని