logo

నెలవారంలో.. యాదవ పరివారం

దురాజ్‌పల్లి పెద్ద(గొల్ల)గట్టు జాతరలో భాగంగా నాలుగో రోజైన బుధవారం సైతం గట్టుకు భక్తులు తరలివచ్చారు.లింగమంతుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published : 09 Feb 2023 03:22 IST

విద్యుత్‌ వెలుగుల్లో గొల్లగట్టు

చివ్వెంల, న్యూస్‌టుడే: దురాజ్‌పల్లి పెద్ద(గొల్ల)గట్టు జాతరలో భాగంగా నాలుగో రోజైన బుధవారం సైతం గట్టుకు భక్తులు తరలివచ్చారు.లింగమంతుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదవులు తమ సంప్రదాయం ప్రకారం నెలవారం భక్తిశ్రద్ధలతో చేపట్టారు. హక్కుదార్లుగా ఉన్న మెంతబోయిన, మున్న వంశస్థులు పాలు, బియ్యం, బెల్లంతో కలిపి రెండు బోనాలను వండి దేవరపెట్టె వద్దకు తీసుకొచ్చారు. లింగమంతులస్వామికి, చౌడమ్మ దేవత, పోతురాజుకు బోనాలలోని నైవేద్యాన్ని సమర్పించారు. ఆలయంలోని చౌడమ్మ దేవతకు ప్రత్యేక మొక్కును చెల్లించారు. ఇరు వంశస్థులకు చెందిన భక్తులు చంద్రపట్నంకు వేసిన స్థలాన్ని అరచేతులతో తాకి కళ్లకు అద్దుకున్నారు. ఆ స్థలంలోని ఆనవాళ్లను మరెవ్వరూ తొక్కకుండా ఉండేందుకు నీటితో కడిగి శుభ్రం చేశారు.

దేవరపెట్టెను తిరిగి కేసారం గ్రామానికి తరలించారు. సూర్యాపేటకు చెందిన కోడి, వల్లపు వంశస్థులు స్వామివారికి ధరింపజేసిన మకరతోరణాన్ని గురువారం తిరిగి తీసుకెళ్లడంతో పెద్దగట్టు జాతర ముగుస్తుందని ఈవో కుశలయ్య తెలిపారు.

జాతరలో జన సందోహం

చంద్రపట్నం ముగ్గు ఎత్తుతున్న యాదవ వంశీయులు

పెద్దగట్టు నుంచి కేసారం గ్రామానికి దేవరపెట్టెను తిరిగి తీసుకెళ్తున్న దృశ్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని