logo

పత్తిచేన్లో దొంగలు పడ్డారు..!

పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పత్తిని భద్ర పరుస్తున్నారు. చాలా మంది రైతులకు ఇళ్ల వద్ద సరైన వసతి లేకపోవడంతో ఆ పత్తిని తమ వ్యవసాయ బావుల వద్ద నిల్వ చేస్తున్నారు.

Published : 09 Feb 2023 03:22 IST

మునుగోడు, న్యూస్‌టుడే

పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పత్తిని భద్ర పరుస్తున్నారు. చాలా మంది రైతులకు ఇళ్ల వద్ద సరైన వసతి లేకపోవడంతో ఆ పత్తిని తమ వ్యవసాయ బావుల వద్ద నిల్వ చేస్తున్నారు. ఉదయం కాపలా ఉంటున్నప్పటికీ రాత్రివేళ ఉండటం లేదు. ఇదే అదునుగా భావించిన కొందరూ గుర్తు తెలియని వ్యక్తులు పత్తిని అపహరిస్తున్నారు.

మచ్చుకు కొన్ని..

చండూరు మండలం బంగారిగడ్డకు చెందిన రైతు వర్కాల భిక్షమయ్యకు ఇంటి వద్ద స్థలం లేకపోవడంతో అతను పండించిన పత్తిని తమ వ్యవసాయ బావి వద్ద ఉన్న రేకుల షెడ్‌లో నిల్వ ఉంచాడు. గతేడాది డిసెంబరు 14న గుర్తు తెలియని దుండగులు 25 క్వింటాళ్ల పత్తిని ఎత్తుకెళ్లారు. ఆ పత్తిని నాలుగు చక్రాల వాహనంలోనే ఎత్తుకెళ్లినట్లుగా అక్కడ ఆనవాళ్లు సైతం కనిపించాయి. ఆ పత్తి విలువ సుమారుగా రూ.2 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

మునుగోడు మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఉప్పునూతుల యాదయ్య పండించిన పత్తిని బావి వద్ద ఉన్న రేకుల షెడ్‌లోనే భద్ర పరిచారు. గుర్తు తెలియని దుండగులు ఈ నెల 18న 15 క్వింటాళ్ల పత్తిని దొంగిలించారు. దాని విలువ సుమారు రూ.1.50 లక్షల వరకు ఉంటుంది.

గుండ్లోరిగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు తమ ఇంటి ఆరుబయట సంచుల్లో పత్తిని నిల్వ ఉంచాడు. ఇంట్లో ఎవ్వరూ లేనిది గుర్తించి అందులో రెండు సంచుల పత్తిని గుర్తు తెలియన వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధిత రైతు స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

మునుగోడు మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన బండారు ప్రహ్లాద తమ వ్యవసాయ బావి వద్ద పత్తిని భద్రపర్చాగా.. అందులో నుంచి రెండు బోరాలను జనవరి 25న ఎత్తుకెళ్లారు.

మునుగోడు మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన మేకల సైదులు తన చేను వద్ద ఉన్న షెడ్‌లో పత్తిని నిల్వ ఉంచాడు. అందులో నుంచి రెండు బోరాలలో ఉన్న పత్తిని ఫిబ్రవరి 5న గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధిత రైతు సైదులు స్థానికంగా ఉన్న వేబ్రిడ్డి వద్ద సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరూ యువకులు తీసుకువచ్చి అక్కడ ఉన్న దళారులకు అమ్మినట్లుగా గుర్తించారు. మరుసటి రోజూ ఆ ఇద్దరూ యువకులు మరో రెండు బోరాలలో పత్తిని తెచ్చి అమ్ముతుండగా గుర్తించి వారిని పోలీసులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని