logo

అన్నదానం.. అభినందనీయం

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించే పోలీసులు, ఇతర శాఖల అధికారులకు సుధాకర్‌ పీవీసీ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు.

Published : 09 Feb 2023 03:22 IST

దురాజ్‌పల్లిలో పోలీసు సిబ్బందికి భోజనం వడ్డిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, చిత్రంలో

సుధాకర్‌ పీవీసీ యజమాని మీలా వాసుదేవ్‌, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, నాగభూషణం, తదితరులు

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించే పోలీసులు, ఇతర శాఖల అధికారులకు సుధాకర్‌ పీవీసీ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. జాతర జరిగే ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరలో భోజన వసతి కల్పిస్తున్నట్లు సుధాకర్‌ పీవీసీ యాజమాన్యం వెల్లడించింది. పోలీసులకు భోజన వసతి కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ పాల్గొని వారికి వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నియంత్రణను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలీసులకు భోజన వసతి కల్పించిన సుధాకర్‌ పీవీసీ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. సుధాకర్‌ పీవీసీ యజమాని మీలా వాసుదేవ్‌, డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వరరెడ్డి, సీఐ సోమ్‌నారాయణ సింగ్‌, ఎస్సై విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని