logo

స్వచ్ఛతలో గెలిచేందుకు..!

పట్టణాల్లో సదుపాయాలు మెరుగు పర్చేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం పురపాలక సంఘాల మధ్య స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలు నిర్వహిస్తోంది.

Published : 09 Feb 2023 03:22 IST

భువనగిరి పట్టణ యంత్రాంగం కసరత్తు
భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే

ట్టణాల్లో సదుపాయాలు మెరుగు పర్చేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం పురపాలక సంఘాల మధ్య స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలు నిర్వహిస్తోంది. ఈ పోటీలతో పురపాలక సంఘాల పరిధిలో మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, పారిశుధ్ధ్యం మెరుగుపర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సర్వీస్‌ లెవల్‌ బెంచ్‌ మార్క్‌, ఓడీఎఫ్‌, గార్బేజ్‌ ఫ్రీ సిటీ, సిటిజన్‌ ఎంగేజ్‌మెంట్‌ అంశాలపై ప్రజలకు అందుతున్న సేవలు, సౌకర్యాలపై కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి బృందాలు మూడు దఫాలుగా సర్వేలు నిర్వహించి మెరుగైన పనితీరును ప్రదర్శించిన పురపాలికలకు ర్యాంకులను ప్రకటిస్తోంది. పురపాలక సంఘాలకు ఓడీఎఫ్‌ ప్లస్‌, ప్లస్‌ ర్యాంకుతో పాటు దక్షిణ భారతదేశం స్థాయిలో పలు ర్యాంకులు గతంలో దక్కాయి.

భువనగిరి పట్టణం

పౌరులకు అందుతున్న సేవలపై బృందం తనిఖీలను ఫిబ్రవరి నెలాఖరు, మార్చి నెలలో ముగ్గురు ప్రతినిధులు మూడు దఫాలుగా సర్వే నిర్వహించనున్నారు. చెత్త సేకరణ, పారిశుద్ధ్యం, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై ప్రజలకు అందుతున్న సేవలపై పౌరుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోనున్నారు. పారిశుద్ధ్యం, తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజలకు పురపాలకులు కల్పిస్తున్న అవగాహనను పరిశీలించి మొత్తం ప్రక్రియపై ర్యాంకు ప్రకటించనున్నారు.

మంచి ర్యాంకును సాధించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోటీలో మంచి ర్యాంకును సాధించడంతో పాటు నగదు పురస్కారం పొందేందుకు డాక్యుమెంటేషన్‌తో పాటు ఇతర ప్రక్రియను పూర్తి చేసేందుకు మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి ఇకో వారియర్స్‌ సంస్థ సేవలను వినియోగించుకుంటున్నారు. సేవలందించినందుకు మున్సిపల్‌ నిధుల నుంచి ఈ సంస్థకు ఏటా రూ.14 లక్షలు చెల్లిస్తుండటం గమనార్హం.


మెరుగైన సేవలకు చర్యలు

నాగిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌

పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు చేపడుతున్నాం. గతంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో సౌత్‌ ఇండియా, రాష్ట్ర స్థాయిల్లో పలు ర్యాంకులను సాధించాం. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. డాక్యుమెంటేషన్‌, ఇతర పనులు చేపట్టేందుకు ఇకో వారియర్స్‌ సంస్థను నియమించాం. సంస్థ ఉద్యోగులు కేంద్రం నుంచి జారీ అవుతున్న నోటిఫికేషన్ల మేరకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత పోటీల్లో మంచి ర్యాంకును సాధిస్తామన్న నమ్మకం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని