logo

పకడ్బందీగా పది పరీక్షలు : కలెక్టర్‌

వచ్చే నెల 3 నుంచి 13వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించాలని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు.

Published : 21 Mar 2023 05:24 IST

పదో తరగతి పరీక్షల నిర్వహణపై నల్గొండలో నిర్వహించిన
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి

నల్గొండ విద్యా విభాగం, న్యూస్‌టుడే: వచ్చే నెల 3 నుంచి 13వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించాలని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. నల్గొండలోని సెయింట్‌ ఆల్ఫోన్‌సెస్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్టు మెంటల్‌ అధికారులు, ప్రశ్నపత్రాల కస్టోడియన్‌లకు సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మాల్‌ ప్రాక్టీస్‌కు ఆస్కారం లేకుండా పరీక్షలు ఆహ్లాద వాతావరణంలో జరపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 107 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 19,414 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఇందులో 19,234 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, 180 మంది ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. డీఈవో భిక్షపతి మాట్లాడుతూ కొవిడ్‌ నేపథ్యంలో ఈ సారి 11 పేపర్లను 6 పేపర్లకు కుదించిందని చెప్పారు. పాత బార్‌కోడ్‌ పద్ధతిని అవలంబించాలని సూచించారు. డీసీఈబీ సెక్రటరీ కొమ్ము శ్రీనివాస్‌, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని