logo

తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

ప్రభుత్వానికి ఇతర ఏ శాఖ నుంచి రాని ఆదాయం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చింది.

Published : 21 Mar 2023 05:24 IST

 ఈ ఏడాది రాబడి రూ.433.2 కోట్లు

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వానికి ఇతర ఏ శాఖ నుంచి రాని ఆదాయం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చింది. ఏడాది క్రితం వరకు క్రయ విక్రయాల జోరు ముమ్మరంగా ఉండేది. తాజాగా ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు ప్రాంతాలను బట్టి 50 శాతం వరకు పెంచడంతో అన్ని వర్గాలపై భారం పడింది. పెరిగిన ధరల కారణంగా ఎక్కువ శాతం మంది రిజిస్ట్రేషన్లు అంటే జంకుతున్నారు. కొంత మంది గ్రామీణ ప్రాంతాల్లోని క్రయ, విక్రయాలకు స్టాంపు పత్రాలతోనే సర్దుకుంటున్నారు. దీంతో పాటు వడ్డీరేట్లు పెరగడం, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల ఊగిసలాట, కరెన్సీ మారకం తగ్గిపోవడం వంటి కారణాలతో హైదరాబాద్‌ ఇతర ప్రాంతాలకు చెందిన స్థిరాస్తి వ్యాపారులు, ఉమ్మడి జిల్లాలో భూములపై పెట్టుబడి పెట్టేవారు తగ్గుతున్నారు.


పెరిగిన ఆదాయం..

ఉమ్మడి జిల్లాలో ఉన్న 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా 2020-21లో 1,31,120 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు జరగగా.. రూ.212.63 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. 2021-22లో 1,54,201 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు జరగగా.. రూ.412.15 కోట్ల ఆదాయం వచ్చింది. 2022-23లో 1,39,070 మాత్రమే డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు జరగగా రూ.433.02 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో యాదాద్రి జిల్లాలో దేవస్థానం అభివృద్ధి కారణంగా ప్రాంతంలో వెంచర్లు పుట్ట గొడుగుల్లా వెలిశాయి. దీంతో పాటు నల్గొండ, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారాలపై పెట్టుబడిదారులు జోరుగా ముందుకు వచ్చారు. అదే విధంగా ఎన్నికలు సమీపిస్తుండటంతో నాయకులు స్థిరాస్తి వ్యాపారులు, పెట్టుబడి దారులు క్రయ విక్రయాలపై వెనక్కి తగ్గడం ద్వారా రిజిస్ట్రేషన్ల శాతం తగ్గుతుందనే అభిప్రాయం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని