logo

ప్రాజెక్టుల సాధనకు పోరాటం

పేపర్‌ లీకేజీలో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రక్షాళన చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి అన్నారు.

Published : 21 Mar 2023 05:24 IST

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి,
జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పేపర్‌ లీకేజీలో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రక్షాళన చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దశాబ్ద కాలంగా జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన కోసం సీపీఐ పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించామన్నారు. అయినా నేటికీ ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. తెలంగాణ విభజన చట్టంలో ఏ ఒక్క హామీని భాజపా నిలబెట్టుకోలేదన్నారు. భాజపా వ్యతిరేకంగా ఏప్రిల్‌ 14 నుంచి దేశ వ్యాప్తంగా హాటావో దేశ్‌కి బచావో నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సీనియర్‌ నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, పల్లా నర్సిరెడ్డి, సహాయ కార్యదర్శిలు పల్లా దేవేందర్‌రెడ్డి, లోడంగి శ్రావణ్‌ కుమార్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, వెంకటరమణ, పబ్చు వీరస్వామి, అంజాచారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని