logo

కిట్లు రావు.. నగదు అందదు

కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం మూడు నెలలకోసారి ఆరోగ్య కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది.

Published : 21 Mar 2023 05:24 IST

మునగాల కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్న విద్యార్థినులు

మునగాల, న్యూస్‌టుడే: కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం మూడు నెలలకోసారి ఆరోగ్య కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. కానీ రెండేళ్లుగా ఈ కిట్లు అందించడం లేదు. ఇక్కడ చదువుకుంటున్న వారు నిరుపేదలే కావడంతో అర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు.

ఖాతాలో జమకాని డబ్బులు.. ఆరోగ్య కిట్ల స్థానంలో విద్యార్థినుల బ్యాంక్‌ ఖాతాల్లో ప్రతి నెలా రూ.100 జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అధికారులు విద్యార్థినుల బ్యాంకు ఖాతాలను, వారి వివరాలను సంబంధిత శాఖకు అందజేశారు. కానీ ఇప్పటివరకు ఒకసారి కూడా ఖాతాలో నగదు జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో 3,298 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం గతంలో కాస్మోటిక్‌ ఛార్జీల కింద ఒక్కో విద్యార్థినికి నెలకు రూ.వంద చొప్పున ఇచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు నెలలకు ఒకసారి రూ.300 విలువచేసే ఆరోగ్య కిట్లు అందజేసింది. ఈ కిట్టులో కొబ్బరినూనె, సబ్బులు, రిబ్బన్లు, పౌడరు ఇలా 15 రకాల వస్తువులు అందజేశారు. కొవిడ్‌ ముందు వరకు వీటిని పంపిణీ చేశారు. తర్వాత ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా నేటికీ కిట్ల పంపిణీ జరగడంలేదు. పాఠశాలలకు ఆరోగ్య కిట్లు రావడంలేదు. ఆరోగ్య కిట్లు అందక, సొంతంగా కొనుగోలు చేయలేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. 
-శ్రవణ్‌, జీసీడీవో

కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఖాతా నంబర్లు సేకరించి అధికారులకు పంపించాం. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని