logo

దవాఖానాల్లో..దగ్గుల మోత

వాతావరణ మార్పులతో.. వారం రోజులుగా వివిధ వ్యాధుల లక్షణాలతో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Published : 22 Mar 2023 04:05 IST

దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఓపీ కోసం బారులు తీరిన జ్వర బాధితులు

దేవరకొండ, న్యూస్‌టుడే: వాతావరణ మార్పులతో.. వారం రోజులుగా వివిధ వ్యాధుల లక్షణాలతో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం సీజనల్‌ జ్వరాలతో ఇంటికొకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. జలుబు, జ్వరం, దగ్గు, వైరస్‌ ఉత్పరివర్తనాలు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో కొద్ది రోజులుగా సాధారణ ఓపి, పిల్లల ఓపీ విభాగాల వద్ద రద్దీ పెరిగింది. మూడు రోజుల్లో 2 వేలకు పైగా ఓపీ, ఇన్‌పేషంట్లకు వైద్య చికిత్సలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అధికంగా చిన్నపిల్లల వైద్యశాలలకు, జనరల్‌ ఫిజీషియన్‌ వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఆర్‌ఎంపీ, పీఎంపీలను ఆశ్రయించి ఆలస్యంగా ఆసుపత్రులకు వస్తున్నారని, ఇష్టారీతిన మందులు వాడకంతో వైరస్‌లను ఎదుర్కొనే శక్తి కోల్పోతున్నారని కొంతమంది వైద్యులు పేర్కొంటున్నారు.

అందుబాటులో వైద్యం: మాతృనాయక్‌, డీసీహెచ్‌

దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఓపీ విభాగంలో లేని సమయంలో అత్యవసర వార్డు వద్దకు వెళ్లి వైద్య చికిత్సలు నిర్వహించుకోవాలి. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు వ్యాపిస్తున్నందున అన్ని రకాల మందులు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని